Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) 75వ సినిమాగా ‘మాస్ జాతర’ (Mass Jathara) రూపొందుతుంది. ‘మనదే ఇదంతా’ అనేది దీని క్యాప్షన్. రవితేజ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. భాను భోగవరపు  (Bhanu Bhogavarapu)  ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గతంలో ఇతను ‘సామజవరగమన’ కి (Samajavaragamana)  రైటర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ సంస్థపై సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాటని విడుదల చేసే ముందు రిలీజ్ చేసిన ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Mass Jathara

కొద్దిసేపటి క్రితం ఫుల్ సాంగ్ ని వదిలారు. ఇక ‘తు మేర లవర్’ లిరికల్ సాంగ్ 4 నిమిషాల 17 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఈ సాంగ్లో ‘ధమాకా’ (Dhamaka) జోడి అయిన రవితేజ-శ్రీలీల (Sreeleela) కెమిస్ట్రీ, ఎనర్జీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి.సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) అందించిన ట్యూన్ కు భాస్కరభట్ల సాహిత్యం మరింత ఎనర్జి చేకూర్చే విధంగా ఉంది. ‘ఇడియట్‌’లోని (Idiot) ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ ట్యూన్ ని తీసుకుని ఈ పాటని మలిచారు.

అంతటితో ఆగకుండా AI సాయంతో దివంగత సంగీత దర్శకుడు చక్రి  (Chakri) గొంతుని కూడా తీసుకొచ్చారు. ఒక్కసారిగా వినగానే ఎక్కేసే విధంగా ఈ పాట ఉంది. కానీ ఎందుకో కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది. మరి మంచి సౌండ్ ఉన్న థియేటర్లలో ఈ పాటను చూస్తే బెటర్ గా అనిపిస్తుందేమో. మీరైతే ప్రస్తుతానికి ఒకసారి చూస్తూ వినేయండి :

డీసెంట్ టాక్.. డీసెంట్ ఓపెనింగ్స్.. కానీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus