‘ఎట్టి పరిస్థితుల్లో మేం చెప్పిన టైమ్‌కి వస్తాం’ అని ‘పెద్ది’ సినిమా టీమ్ చెబుతుంటే.. మీరు ఏం చేసినా ఆ టైమ్‌కి సినిమాను రిలీజ్ చేయలేరు అని పరిశ్రమలోని కొన్ని వర్గాలు పని గట్టుకుని ప్రచారం చేస్తునన్నాయి. అంతేకాదు మార్చి ఆఖరి వారంలో వస్తామంటున్న రెండు సినిమాలు రావు అని లెక్కలేసి, గీతలు గీసి మరీ చెప్పేస్తున్నాయి. టాలీవుడ్ మాటల్ని మనం కొన్నిసార్లు నమ్మొచ్చు కాబట్టి ఇది జరిగే అవకాశం కూడా ఉంది. ఆ లెక్కన మార్చి ఆఖరి వారం ఖాళీ అయితే ఓ పెద్ద సినిమా ఆ డేట్‌కి రావొచ్చు అని అంటున్నారు.
ఆ సినిమా కూడా మెగా ఫ్యామిలీ నుండే. అదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. ఎప్పుడో పవన్ కల్యాణ్ తన పనిని పూర్తి చేసినా.. ఎందుకో కానీ సినిమా గురించి ఎక్కడా ఊసు లేదు. మిగిలిన పాత్రల వర్క్ ఉందని ఆ మధ్య దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పినా.. ఆ పనులు అవుతున్నట్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెబుతున్నా.. ఆ సమాచారం కూడా బయటకు రావడం లేదు.
ఎందుకు అని కాస్త గట్టిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. సినిమా షూటింగ్ పనులు పెండింగ్ ఉన్నాయని కొందరు చెబుతున్నారు. మరికొందరేమో విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఉన్నాయి అంటున్నారు. మరికొందరు అయితే సరైన సోలో డేట్ కోసం నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు మార్చి ఆఖరి వారంలో ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ రాకపోతే అది పెద్ద సోలో డేటే. కాబట్టి అప్పుడు సినిమాను తీసుకురావొచ్చు. అదే జరిగితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి హ్యాపీనే.
మరప్పుడు రావాల్సిన ‘పెద్ది’ ఎక్కడకు వెళ్తుంది అనేగా డౌట్. ఆ సినిమాను మే ఆఖరులో విడుదల చేయాలని చూస్తున్నారట. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉండటం వల్లే ఈ వాయిదా అని ఇండస్ట్రీ వర్గాల టాక్.