Vikram Movie: ఆ రాష్ట్రంలో బాహుబలి2 రికార్డ్ బ్రేక్ కానుందా?

  • June 13, 2022 / 06:32 PM IST

సౌత్ ఇండియాలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో కమల్ హాసన్ ఒకరు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా థియేటర్లలో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. ఇతర సినిమాల నుంచి పోటీ ఎదురవుతున్నా విక్రమ్ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. అయితే తమిళనాడు రాష్ట్రంలో విక్రమ్ బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు రాష్ట్రంలో బాహుబలి2 కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఈ సినిమా 155 కోట్ల రూపాయల కలెక్షన్లతో తమిళనాడులో నంబర్1 స్థానంలో ఉంది. ఈ సినిమా తర్వాత బిగిల్ సినిమాతో విజయ్ 141 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి రెండో స్థానంలో ఈ సినిమాను నిలిపారు. తమిళనాడులో విక్రమ్ సినిమాకు ఇప్పటివరకు 130 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. కమల్ హాసన్ ఈ రికార్డును బ్రేక్ చేసి తమిళనాడులో విక్రమ్ ను నంబర్1 స్థానంలో నిలుపుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తమిళనాడు క్రిటిక్స్ సైతం ఐదేళ్ల తర్వాత బాహుబలి2 రికార్డ్ బ్రేక్ కానుందని కామెంట్లు చేస్తున్నారు. విక్రమ్ సినిమా సక్సెస్ తో కమల్ హాసన్ తర్వాత ప్రాజెక్ట్ లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిర్మాతలకు ఈ మధ్య కాలంలో ఏ సినిమా అందించని స్థాయిలో విక్రమ్ లాభాలను అందిస్తోంది. బాహుబలి2 ఫుల్ రన్ లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఎన్నో చెక్కు చెదరని రికార్డులు ఈ సినిమా ఖాతాలో ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో బాహుబలి2 సాధించిన కొన్ని రికార్డులను బ్రేక్ చేసినా మెజారిటీ రికార్డులు మాత్రం ఇప్పటికీ బ్రేక్ కాలేదు. ప్రభాస్ రాజమౌళి బాహుబలి2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారు. హిందీలో కూడా ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సాధించింది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus