Writer Padmabhushan Collections: సైలెంట్ గా వచ్చి ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయిపోయింది..!

‘ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్’ అండ్ ‘లహరి ఫిలిమ్స్’ బ్యానర్ల పై సుహాస్ హీరోగా టీనా శిల్ప రాజ్ రోహిణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షణ్ముఖ ప్రశాంత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫిబ్రవరి 3న ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. సుహాస్ ప్రేక్షకుల్లో కొంత క్రేజ్ సంపాదించుకున్న నటుడు కావడంతో ఈవెనింగ్ షోలకు కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.

ఓవర్సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది ఈ చిత్రం. దీంతో ఫైనల్ గా ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.85 cr
సీడెడ్ 0.27 cr
ఆంధ్ర(టోటల్) 0.92 cr
ఏపీ + తెలంగాణ 2.04 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.05 cr
ఓవర్సీస్ 0.60 cr
వరల్డ్ వైడ్ టోటల్ 2.69 cr

‘రైటర్ పద్మభూషణ్’ చిత్రానికి రూ.1.75 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.2.69 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. బయ్యర్స్ కు ఈ మూవీ రూ.0.94 కోట్ల లాభాలను అందించింది. సుహాస్ హీరోగా మొదటి థియేట్రికల్ సక్సెస్ అందుకున్న మూవీగా ‘రైటర్ పద్మభూషణ్’ నిలిచింది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus