KGF 2: ‘కె.జి.ఎఫ్2’ పాటలకి అంత సత్తా ఉంటుందా?

Advertisement

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘కె.జి.ఎఫ్’ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి అందరికీ తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. దీనికి కొనసాగింపుగా ‘కె.జి.ఎఫ్2’ని కూడా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.ఆల్రెడీ విడుదలైన టీజర్ కూడా యూట్యూబ్లో రికార్డులు సృష్టించింది. ఇక ‘కె.జి.ఎఫ్’ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ విషయంలో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

రూ.70కోట్ల వరకు ఈ చిత్రానికి తెలుగులో బిజినెస్ జరుగుతుంది. నిజానికి ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ చిత్రానికి తెలుగులో కేవలం రూ.5 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది.అయితే ఫుల్ రన్లో రూ.10 కోట్ల పైనే వసూళ్ళను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. ‘కె.జి.ఎఫ్2’ ఆడియో రైట్స్ కు కూడా భారీ డీల్ దక్కింది.ఇండియాలో లీడింగ్ సంస్థ అయిన .. లహరి టి సిరీస్ వారు ప్రెస్టీజియస్ మూవీ అయిన ‘కె.జి.ఎఫ్ 2’ ఆడియో రైట్స్ ను ఏకంగా రూ.7.2కోట్లకు కొనుగోలు చేశారు.

దీంతో అత్యధిక రేటుకి అమ్ముడైన సినిమాల ఆడియో రైట్స్ విషయంలో నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకుంది ‘కె.జి.ఎఫ్’. నిజానికి ‘కె.జి.ఎఫ్1’ ఆడియో అంత బిగ్గెస్ట్ హిట్టేమి కాదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. ఆ మ్యూజిక్ ను వాడుకోని షోలు కూడా ఉండవు అనడంలో అతిశయోక్తి లేదు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus