వైఫై ఓపెనింగ్స్ కు ఎఫెక్ట్ చేస్తున్న ఏడు చేపల కథ

శ్రుతిమించిన శృంగారం ఒంటికి మంచిది కాదు కానీ.. సినిమాలకు మాత్రం ఎప్పుడు ప్లస్సే. అందుకే.. “గుంటూరు టాకీస్” లాంటి సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ బాటలో హిట్ అయిన సినిమాల లిస్ట్ కూడా పెద్దదే. అయితే.. ఈ సినిమాలు హిట్ అవ్వడానికి శృంగారం మాత్రమే కాదు కథ-కథనం కూడా కీలకపాత్ర పోషించాయి. అయితే.. నవతరం దర్శకుడు ఈ కథ-కథనం అనే అత్యంత కీలకమైన విషయాన్ని వదిలేసి.. శృంగార సన్నివేశాలు ఉంటే చాలు సినిమాకి జనాలు వచ్చేస్తారు అనే భ్రమలో బ్రతికేస్తున్నారు. మొదటిరోజు కొందరు ప్రేక్షకులు ఈ తరహా సినిమాల కోసం ఎగబడడం ఖాయం. కానీ.. టాక్ బాగోకపోతే సెకండ్ డే నుంచి సినిమాను ఎవడూ చూడడు. ఈ విషయాన్ని ఎందుకనో మన దర్శకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.

రేపు విడుదలవుతున్న “వైఫై” పరిస్థితి కూడా అంతే. “ఏడు చేపల కథ” ఫేమ్ టెంప్ట్ రవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం రేపు విడుదలవుతున్నప్పటికీ.. ప్రేక్షకులు సినిమాపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఓపెనింగ్స్ కూడా కష్టమే. రష్మీతో “అంతం” అనే సినిమా తీసి భీభత్సమైన లాభాలు అందుకున్న జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ ఈ చిత్రానికి దర్శకుడు-నిర్మాత. ఈ వైఫై అందరికీ కనెక్ట్ అవుతుందా లేదా అనేది రేపు తెలుస్తుంది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus