జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన శ్రీ చలసాని శ్రీనివాసరావు, యోగేంద్ర యాదవ్

స్వరాజ్ అభియాన్ నేత, అమ్ ఆద్మీ మాజీ కార్యనిర్వాహక సభ్యుడు శ్రీ యోగేందర్ యాదవ్ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ ను గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో తాను జరిపిన పర్యటన వివరాలను యోగేందర్ యాదవ్ శ్రీ పవన్ కళ్యాణ్ కు తెలిపారు. ఢిల్లీ వాసిని అయిన తనకు ఆంధ్రప్రదేశ్ అంటే పచ్చటి పొలాలు,గోదావరి,కృష్ణ నదులతో కళ కళ లాడుతుందని మాత్రమే తెలుసని,అయితే అనంతపురం జిల్లాను చూసిన తరువాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని చెప్పారు.అనంతపురం జిల్లా కరువు,నిరోద్యగం,ఆకలి బాధలు,నేతన్నల కష్టాలు చూసి తాను చలించిపోయానని చెప్పారు.బున్దేల్ ఖండ్ మాదిరిగానే అనంతపురం జిల్లా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. జనసేన కార్యాలయానికి వచ్చిన శ్రీ యోగేందర్ యాదవ్ కు శ్రీ పవన్ కళ్యాణ్ సాదరంగా స్వాగతం పలికారు.

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు శ్రీ చలసాని శ్రీనివాసరావు గురువారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలుసుకున్నారు.శ్రీ పవన్ కళ్యాణ్ చొరవతో ఏర్పాటైన జాయింట్ ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ కి ఆయన సంఘీభావం ప్రకటించారు.16 న హైదరాబాద్ లో జరగనున్న జాయింట్ ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ తొలి సమావేశానికి తమ సమితి ప్రతినిధులతో కలసి హాజరవుతున్నట్లు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఎంత ఇచ్చిందో, ఎంత ఖర్చయిందో, ఇంకా రావలసింది ఎంత ఉందో లెక్కలు తేల్చవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.శ్రీ పవన్ కళ్యాణ్ గారితో శ్రీ చలసాని గారు కొంత సేపు ఏకాంతంగా చర్చలు జరిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus