Nagarjuna: నాగార్జున ధరించిన షర్ట్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

నాగార్జున ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలుగులో ఏడవ సీజన్ ప్రసారమవుతూ ఇప్పటికే 8 వారాలను పూర్తిచేసుకుంది. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం 8 వారాలను పూర్తిచేసుకుని తొమ్మిదవ వారంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ కార్యక్రమం గత సీజన్లతో పోలిస్తే కాస్త పర్వాలేదని చెప్పాలి. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో సరికొత్త కంటెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ కార్యక్రమం పరవాలేదు అనిపించుకుంది.

ఇకపోతే ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున వేదిక పైకి వచ్చి కంటెస్టెంట్లతో ముచ్చటించే సంగతి మనకు తెలిసిందే. అయితే వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున ధరించే షర్ట్స్ కాస్త డిఫరెంట్ గా ఉంటాయని చెప్పాలి. నాగార్జున వేసుకునే షర్ట్ చూడటానికి డిఫరెంట్ గా ఉన్నప్పటికీ వీటి ఖరీదు మాత్రం భారీగా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే (Nagarjuna) నాగార్జున ఎనిమిదవ వారంలో భాగంగా ఎల్లో కలర్ షర్ట్ ధరించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

చూడటానికి ఎల్లో కలర్ లో ఉన్నప్పటికీ ఆ షర్ట్ మీద స్టార్స్ తో ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. చూడటానికి ఈ షర్ట్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ దీని ఖరీదు మాత్రం భారీగా ఉండటంతో అందరూ కూడా ఈ షర్ట్ ఖరీదు తెలిసి షాక్ అవుతున్నారు. మరి వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున ధరించిన ఈ షర్ట్ ఖరీదు ఎంత అనే విషయానికి వస్తే… ఎల్లో కలర్ చొక్కాపై స్టార్స్ డిజైన్స్ తో కూడినటువంటి ఈ షర్ట్ ఖరీదు ఏకంగా 25 వేల రూపాయలనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ షర్ట్ ఖరీదు ఇన్ని వేల రూపాయల అంటూ ఆశ్చర్యపోతున్నారు అయితే నాగార్జున సాధారణంగా వీకెండ్ ఎపిసోడ్ కి వేసుకొని వచ్చే షర్టులతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖరీదనే చెప్పాలి. ఈయన కొన్ని లక్షల విలువచేసే షర్ట్స్ కూడా ధరించి వీకెండ్ ఎపిసోడ్స్ లో సందడి చేస్తూ ఉంటారు. ఇలా సెలబ్రిటీలు వేసుకునే డ్రెస్సులు కాస్ట్ మనకు చాలా ఎక్కువగా అనిపించినప్పటికీ సెలబ్రెటీలకు మాత్రం ఈ ఖరీదు చాలా సర్వసాధారణం అనిపిస్తుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus