పాత్ర కోసం మారాల్సిందే – ప్రభాస్

  • February 16, 2018 / 06:35 AM IST

క్యారక్టర్, కథ బాగుండాలే గానీ అందుకోసం రోజులు, నెలలు కాదు సంత్సరాలైనా కష్టపడుతానని బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ చెప్పారు. ఏ స్టార్ హీరో కేటాయించలేనన్ని డేట్స్ ని ఈ మూవీ కోసం ప్రభాస్ ఇచ్చారు. అంతేనా.. రోజులు 14 గంటలపాటు కష్టపడ్డారు. ఇలా ఐదేళ్లు శ్రమించారు. ఈ చిత్రాలు అతన్ని ఇండియన్ స్టార్ ని చేశాయి. ఆ పాత్ర నుంచి బయటికి వచ్చి సుజీత్ చెప్పిన క్యారక్టర్ కోసం కష్టపడుతున్నారు. ఇందుకోసం పెరిగిన బరువును మొత్తం తగ్గించుకొని స్మార్ట్ గా తయారయ్యారు. వీరి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సాహో స్టడీగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులోని క్యారెక్టర్ గురించి ప్రభాస్ మాట్లాడారు.

‘‘నేనెప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడాన్ని ఇష్టపడను. సినిమాలో నేను చేయాల్సిన పాత్ర నన్ను అంతగా ఆకట్టుకోకపోతే అసలు దానికి ఓకే అనే చెప్పను. ఈ పాత్ర కోసం ఎంత కష్టమైనా పడాలి అనిపించేలా ఉండాలి. అలాంటి స్క్రిప్టు దొరకాలి. కొత్తగా ప్రయత్నించాలి అనుకున్నప్పుడు మారక తప్పదు.’’ అంటూ ప్రభాస్ చెప్పారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ నటిస్తోంది. ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెరెక్కుతోన్న సాహో పై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus