నన్ను…వేధిస్తూ…డిస్టర్బ్ చేస్తున్నాడు – రాశి ఖన్నా!!!

టాలీవుడ్ అందాల భామల్లో…తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుని…కూల్ గా, మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ…వరుస సినిమాలతో…. టాప్ లెవల్ లో దూసుకెళుతున్న భామ  రాశిఖన్నా. ఈ అమ్మడు సినిమాలను ఆచి తూచి ఎంచుకుంటూ భారీ హిట్స్ సాధిస్తూ ముందుకూపోతు ఉండడంతో, మిగిలిన ముద్దు గుమ్మలు కాస్త ఆలోచనలో పడ్డారని టాలీవుడ్ లో టాక్.  ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సక్సెస్ బాటలో నడుస్తోంది. తాజాగా ఆమె నటించిన సుప్రీం సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్స్ ఈ బ్యూటీ ని చుట్టుముట్టాయి.

ఇదిలా ఉంటే ఈమధ్య కాలంలో ఈ భామ ఒక చిన్న సమస్యతో ఇబ్బంది పడుతుంది….అదేమిటంటే…షూటింగ్స్ లేని సమయంలో…వీలుదొరికినప్పుడల్లా తన పేరెంట్స్ తో సొంత ఊర్లో ఉండటానికి ఇష్టపడుతుంది. షూటింగ్ ల కోసం విదేశాలకు వెళితే అక్కడ చాలా మంది తెలుగు వాళ్లు రాశిఖన్నాను గుర్తుపట్టి పలకరిస్తున్నారట. అది తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని అమ్మడు ఉబ్బితబ్బిబవుతోంది. అయితే అమ్మడును ఎవరో ఓ వ్యక్తి మాత్రం వేధిస్తున్నట్లు తెలిపింది. ఆ వ్యక్తి తాను ఎక్కడకి వెళితే అక్కడికి వస్తున్నాడని… ఆ వ్యక్తి వల్ల కాస్త డిస్ట్రబ్ గా ఫీలవుతానని… ఇంతకీ ఎవరా వ్యక్తి అన్నదానికి మాత్రం ఆమె సమాధానం ఇవ్వలేదు. అయినా ఆ రంగంలో ఇలాంటివి సర్వ సాధారణం అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus