వరుస సినిమాలతో యంగ్ హీరో విశ్వ కార్తికేయ జోరు

చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన విశ్వ కార్తికేయ.. ప్రస్తుతం హీరోగా ఫుల్ బిజీ అయ్యారు. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. రోల్ ఎలాంటిదైనా సరే అందులో ఒదిగిపోయి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు విశ్వ కార్తికేయ.

రీసెంట్ గా విశ్వ కార్తికేయ హీరోగా వచ్చిన జై సేన, కళాపోషకులు సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. దీంతో అదే జోష్ లో మరికొన్ని సినిమాలు కమిటై విలక్షణ పాత్రలతో ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అవుతున్నారు విశ్వ కార్తికేయ. కామెడీ, యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తన మార్క్ చూపించాలనే కసితో విశ్వ కార్తికేయ అడుగులు పడుతున్నాయి.

ప్రస్తుతం విశ్వ కార్తికేయ పలు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అల్లంత దూరాన అనే మల్టీలాంగ్వేజ్ సినిమా చేస్తున్నారు విశ్వ కార్తికేయ. చలపతి పువ్వాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో పాటు సురేష్ లంకపల్లి దర్శకత్వంలో IPL తెలుగు సినిమా చేస్తున్నారు విశ్వ కార్తికేయ. ఈ రెండు సినిమాలు అతిత్వరలో రిలీజ్ కానున్నాయి.

అదేవిధంగా రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో రూపొందుతున్న Nth Hour సినిమాలో నటిస్తున్నారు విశ్వ కార్తికేయ. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రేక్షకులు నచ్చే, మెచ్చే కథలతో అందరిముందుకొచ్చి కెరీర్ బిల్డ్ చేసుకుంటానని చెబుతున్న విశ్వ కార్తికేయ.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus