నారా రోహిత్, సత్యదేవ్, సుధీర్ బాబు.. మళ్ళీ సేమ్ సీన్..!

  • June 18, 2024 / 08:56 PM IST

ఎంత టాలెంట్ ఉన్నా.. ఎంత హార్డ్ వర్క్ చేయగలిగినా.. ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ సంపాదించుకోవాలి అంటే లక్ కూడా కలిసి రావాలి. ఈ విషయం అనేక సార్లు ప్రూవ్ అయ్యింది. సారీ సారీ ప్రూవ్ అవుతూనే వస్తుంది. మంచి కథలు చేసే యంగ్ హీరోలు టాలీవుడ్లో చాలా మంది ఉన్నారు. కానీ వారికి సక్సెస్ అనేది అందని ద్రాక్షలానే ఉంటుంది. ఒకవేళ సక్సెస్ అయినా.. వాళ్ళ మార్కెట్ ఏమీ పెరగడం లేదు. ఈ లిస్ట్ లో కచ్చితంగా చెప్పుకోవాల్సింది సత్యదేవ్ (Satyadev), నారా రోహిత్ (Nara Rohith), సుధీర్ బాబు (Sudheer Babu)..లని అనడంలో అతిశయోక్తి లేదు.

పాపం.. ఈ ముగ్గురు హీరోలు ఎన్ని విధాలుగా కస్టపడి… ట్రై చేసినా సక్సెస్ కొట్టి మార్కెట్ పెంచుకోలేకపోతున్నారు. నారా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత ‘ప్రతినిథి 2 ‘ (Prathinidhi-2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. కానీ మొదటి రోజు ఈవెనింగ్ షోలు కూడా ఫిల్ అవ్వలేదు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ మూవీ. అలాగే సత్యదేవ్ కూడా కొంత గ్యాప్ తీసుకుని ‘కృష్ణమ్మ’ (Krishnamma) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాకి కూడా మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. రిలీజ్ అయిన వారానికే ఓటీటీలోకి వచ్చేసింది. ఇక తాజాగా సుధీర్ బాబు .. ‘హరోం హర’ (Harom Hara) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు కావడం లేదు. ఎంత టాలెంట్ ఉన్నా నారా రోహిత్, సత్యదేవ్, సుధీర్ బాబు..లకి టైం మాత్రం కలిసి రావడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus