మన దగ్గర ఓ నటి ఉన్నారు. ఆమెను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే అంతెత్తున ఎగురుతారు. అలా పిలవడడం ఆమెకు నచ్చదు. అందుకే కోపమవుతుంటారు. అలాగే ఆ కోపం ఆమె ఇష్టం. కానీ ఆమె కంటే నాలుగేళ్లు చిన్న అయిన ఓ హీరోయిన్ ఓ అంమ్మాయి వచ్చి ఆంటీ అని పిలిస్తే ‘ఓకే పిలువు ఫర్వాలేదు’ అని అంది. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సోషల్ మీడియాను మీరు బాగా ఫాలో అయ్యేవాళ్లు అయితే ఆ పిలిచిన అమ్మాయి రాషా తడానీ అని, పిలిపించుకున్నామె తమన్నా (Tamannaah Bhatia) అని ఈజీగా చెప్పేస్తారు.
అవును, వాళ్లిద్దరి మధ్య ఇటీవల జరిగిన చర్చే ఇప్పుడు మీకు మేం చెబుతున్నాం. ఇటీవల ఓ ఈవెంట్ కోసం వచ్చిన తమన్నా (Tamannaah), రాషా తడానీ ఏదో మాట్లాడుకున్నారు. ఆ వేడుకకు హాజరైన యంగ్ బ్యూటీ రాషా తడానీ.. తమన్నాను ఆంటీ అని పిలిచింది. దాంతో అక్కడున్నవాళ్లు షాక్ అయ్యారు. అయితే తమన్నా మాత్రం ఏం పర్లేదు నన్ను ఆంటీ అని పిలువు అని చెప్పింది. ఈ ఇప్పుడు వీడియో వైరల్ అవుతోంది.
అన్నట్లు తమన్నాను రాషా ఆంటీ అని పిలవగానే పక్కనే ఉన్న తమన్నా ప్రియుడు విజయ్ వర్మ (Vijay Varma) కూడా షాక్ అయ్యాడు. రాషా అంటే ఎవరో మీకు తెలిసే ఉంటుంది. నిన్నటి తరం హీరోయిన్ రవీనా టాండన్ (Raveena Tandon) కుమార్తెనే రాషా. ఇంకా హీరోయిన్‌గా ఆమె నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ‘ఆజాద్’ అనే సినిమా ద్వారా ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది.
అజయ్ దేవగణ్ (Ajay Devgn), అమన్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఓ మోస్తరు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన విజయం అందుకోలేదు. ఇక తమన్నా అయితే ‘ఓదెల 2’ సినిమా చేస్తోంది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అన్నట్లు రాషా వయసు 19 మాత్రమే. ఆ ఉద్దేశంతోనే ఆంటీ అని పిలిచిందేమో.
SHOCKINGLY #Tammana Says CALL ME AUNTY no issue #RashaTadani – Great Gesture From Tammu
— GetsCinema (@GetsCinema) January 21, 2025