Thandel: ‘తండేల్’ సెకండ్ సింగిల్.. దేవి మళ్ళీ మ్యాజిక్ చేశాడా?

నాగ చైతన్య (Naga Chaitanya)  , సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ (Love Story) పెద్ద హిట్ అయ్యింది. దీని తర్వాత వీరి కాంబోలో ‘తండేల్’  (Thandel) అనే సినిమా రూపొందుతుంది. కోస్టల్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాకి చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకుడు. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్  (Bunny Vasu) ఈ చిత్రాన్ని దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కాబోతోంది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీత దర్శకుడు.

Thandel

ప్రమోషన్లలో భాగంగా విడుదలైన ‘బుజ్జి తల్లి’ పాట చార్ట్ బస్టర్ అయ్యింది. తాజాగా ‘హైలెస్సో’ అనే మరో లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. 3 :49 సెకన్ల నిడివి కలిగిన ఈ పాట.. ‘ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్న అసలే అలుపు రాదు’ అంటూ మొదలైంది. ‘హైలెస్సో హైలెస్సో’ అనే లిరిక్స్ మంచి హై ఇచ్చాయి. దేవి అందించిన ట్యూన్ చాలా బాగా కుదిరింది. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటని నకాస్ అజీజ్ (Nakash Aziz), శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal)…లు ఎంతో జోష్ తో పాడారు.

తండేల్ రాజ్(నాగ చైతన్య) తన ప్రియురాలు సత్య(సాయి పల్లవి) కి దూరంగా ఉన్నప్పుడు.. ఓ పక్కన చేపల్ని వేటాడుతూనే.. మరోపక్క తనని వెంటాడుతున్న ప్రియురాలి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఈ పాటని పాడుకుంటాడు అని స్పష్టం అవుతుంది. ఈ లిరికల్ సాంగ్లో చైతన్య, సాయి పల్లవి.. ల హావభావాలు యూత్ ని అమితంగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి ‘బుజ్జి తల్లి’ పాటలానే ‘హైలెస్సో’ పాట కూడా ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అయిపోయినట్టే అని చెప్పాలి. మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి :

‘పటాస్’ కి 10… ఏళ్ళు ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus