సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా తండ్రయ్యాడు. యువన్ భార్య జఫ్ఫ్రున్నీషా ఏప్రిల్ 7వ తేదీన పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. యువన్ దంపతులతో పాటు ఇళయరాజా కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేవు. కారణం ఏంటంటే.. యువన్ తల్లి, స్వర్గీయ జీవా ఇళయరాజా పుట్టినరోజు నాడు అమ్మాయి జన్మించింది. అక్టోబర్ 31, 2001న జీవా ఇళయరాజా స్వర్గస్తులయ్యారు. ఐదేళ్ల తర్వాత యువన్ అమ్మ మళ్లీ పుట్టిందని అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అమ్మంటే యువన్ శంకర్ రాజాకు ఎంతో ప్రేమ. యువన్, జఫ్ఫ్రున్నీషా జనవరి 1, 2015న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంగీత దర్శకుడికి ఇది మూడో పెళ్లి. గతంలో సుజనా చంద్రన్, శిల్పా మోహన్ లను పెళ్లి చేసుకున్న యువన్ అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయారు. తర్వాత ఇస్లాం మతం స్వీకరించారు. దర్శకుడు వెంకట్ ప్రభు, పలువురు సినీ ప్రముఖులు యువన్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.