కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘యువరత్న’.కన్నడంతో పటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో రిలీజ్ చేశారు. ‘అఖిల్’ ఫేమ్ సాయేషా సైగల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సాయికుమార్ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 1న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ ను సంపాదించుకుంది. అయితే హీరో పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా ‘కె.జి.ఎఫ్’ నిర్మాతలైన ‘హోంబెల్ ఫిలిమ్స్’ వారి ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడంతో ఓ మాదిరిగా కలెక్షన్లు నమోదవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
0.10 cr
సీడెడ్
0.07 cr
ఉత్తరాంధ్ర
0.08 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)
0.25 cr (షేర్)
‘యువరత్న’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కె.జి.ఎఫ్ నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళే ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి 0.55కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 0.25 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 0.30కోట్ల షేర్ ను రాబట్టాలన్న మాట. మరో రెండు రోజులు ఇదే జోరుని కొనసాగిస్తే సినిమా చాలా వరకూ రికవరీ సాధించినట్టే. అయితే ‘వైల్డ్ డాగ్’ ‘సుల్తాన్’ వంటి క్రేజీ చిత్రాల పోటీగా ఉండడంతో అది అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి.