రికార్డుల బ్రేకర్ ప్రిన్స్ ‘మహేష్ బాబు’

ఘట్టమనేని వారసుడు, టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు తన తండ్రి బాటలో నడుస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీ లో రికార్డులను తిరగ రాస్తున్నాడు. తన కలక్షన్ రికార్డ్ లను తానే బీట్ చేస్తూ నంబర్ వన్ సింహాసనం ఫై ధీమా గా కూర్చొని ఉన్నాడు.

రాజకుమారుడు

రాజకుమారుడు (1999) చిత్రంలో రాజాగా కనిపించి అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారాడు. కె రాఘవేంద్ర రావు దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీ విజయాన్ని సాధించింది. తొలి సినిమా తోనే కమర్షియల్ హీరో అనిపించుకున్నాడు.

మురారి

ఫ్యామిలీ మొత్తాన్ని తన అభిమానులుగా చేసుకున్న చిత్రం మురారి. 2001 లో వచ్చిన మూవీలో మహేష్ అన్ని రకాల షేడ్స్ ని చూపించాడు. సెంటిమెంట్ సీన్ లలో చక్కగా నటించి .. రాబోయే కాలంలో తనదే నంబర్ వన్ స్థానం అని సూచించాడు.

ఒక్కడు

2003లో రిలీజ్ అయిన ఒక్కడుతో కలక్షన్ల వర్షం కురిపించాడు. కబడ్డీ ప్లేయర్ గా, లవర్ ని సొంతం చేసుకునే యువకుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 23 కోట్లు రాబట్టింది. దీంతో అప్పటి వరకు ఉన్న రికార్డ్ లు చెరిగిపోయాయి. ప్రిన్స్ తొలి సారి నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నాడు.

అతడు

2005లో అతడు తో దిమ్మ దిరేగేలా చేశాడు. నంద గోపాల్, పార్ధు గా మహేష్ నటనను మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేక పోయారు. పక్క ప్రొఫిషనల్ కిల్లర్ గా రికార్డులన్నింటినీ మర్డర్ చేశాడు.

పోకిరి

అండర్ కవర్ పోలీస్ గా మహేష్ చేసిన యాక్షన్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పోకిరి సినిమా తో తెలుగు సినిమాలు 50 కోట్ల మార్క్ ను దాటగలదని చూపించాడు. అనధికారంగా 70 కోట్లు వసూల్ చేసిందని టాక్. తెలుగు సినిమా ఇన్ని కోట్లు రాబట్ట గలదా? అని సినీ పండితులు ఆశ్చర్య పోయారు.

ఖలేజా

మాటల మాంత్రికుడితో మహేష్ చేసిన మరో సినిమా ఖలేజ. అతడులో మహేష్ ని సీరియస్ గా చూపించిన త్రివిక్రమ్ .. ఈ సినిమాలో అతడితో కామెడీ చేయించాడు. మహేష్ కామెడీ టైం ఇందులో అదిరిపోతుంది. ప్రతి మాట పంచ్ లాగే ఉంటుంది. మహేష్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

దూకుడు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా.. తండ్రికి మంచి కొడుకిగా.. అయన కోసం ఒక రాజకీయ నాయకుడుగా, మరో వైపు ప్రియుడిగా ఒకే సినిమాలో నాలుగు షేడ్స్ ని అద్భుతంగా పలికించాడు. దీంతో దూకుడు దూసుకు పోయింది. ఈ చిత్రం తో భారీ వసూళ్లు రాబట్టి నంబర్ వన్ కుర్చీలో మహేష్ ధీమాగా సెటిల్ అయిపోయాడు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

తెలుగు సూపర్ స్టార్ అయి వుండి ఎటువంటి భేషజాలకు పోకుండా వెంకటేష్ తో కలిసి స్క్రీన్ ని పంచుకున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) చిత్రంలో చిన్నోడుగా సింపుల్ గా కనిపించి 50 కోట్లను దాటించేసాడు.

శ్రీమంతుడు

ఊరిని దత్తత తీసుకునే మంచి కాన్సెప్ట్ తో వచ్చిన “శ్రీమంతుడు” సినిమా మహేష్ అభిమానులతో పాటు అందరిని ఆకట్టుకుంది. అందుకే ఈ చిత్రం ఏకంగా రూ. 175 కోట్లు వసూలు చేసింది. మహేష్ “శ్రీమంతుడు”తో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చూపించాడు.

బ్రహ్మోత్సవం

తెలుగు చిత్ర పరిశ్రమ కలక్షన్ ల ఉత్సవం చేసుకోవడానికి “బ్రహ్మోత్సవం” తో ఈనెల 20న మన ముందుకు రాబోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో భారీ తారాగణం తో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫై ఎన్నో అంచనాలున్నాయి. మరో సారి సూపర్ స్టార్ సత్తాని లోకానికి తప్పక చాటుతాడని, తన రికార్డులను తానే బద్దలు కొడతాడని అభిమానులు, సినీ పండితులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus