ఈ 10 సినిమాల్లోనూ వివేక్ కామెడీ అదుర్స్ అంతే..!

నవ్వుకి భాష ఉంటుందా.. ఉండదు..! అది యూనివర్సల్..!అందుకే ఆ నవ్వుని పంచే వాళ్ళు కూడా మన గుండెల్లో నిలిచిపోతుంటారు. తమిళ్ డబ్బింగ్ మూవీస్ తోనే ఈయన తెలుగులో బోలెడంత క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు వివేక్. ఈయన కామెడీ లో స్పెషల్ ఏంటి అంటే.. ఒక సోషల్ ఇష్యూ పైనే తనదైన శైలిలో క్రిటిసైజ్ చేస్తూ కామెడీ పండిస్తూ ఉంటారు. ఈయన రిటైర్ కూడా కాబట్టి.. తన క్యారెక్టర్ కు సంబందించిన డైలాగ్స్ ను ఇంప్రొవైజ్ చేసుకుంటూ ఉంటారు వివేక్ గారు. అనుకోని విధంగా ఈరోజు ఆయన మరణించారు.శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈయన శనివారం ఉదయం 5గంటలకు మరణించారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి తెలుగులో ఈయనకు క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సఖి :

మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో మంచి పాత్రనే పోషించారు వివేక్ గారు.

2) వాలి :

ఎస్. జె.సూర్య డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో వివేక్ గారు మంచి కామెడీని పండించారు.

3) బాయ్స్ :

ఈ చిత్రంలో ఒక మెంటర్ గా కనిపిస్తూనే మంచి కామెడీని పండించారు.

4) రన్ :

లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వివేక్ గారు అద్భుతమైన కామెడీని పండించారు.అయితే తెలుగు వెర్షన్లో ఆయన పాత్రని సునీల్ పోషించారు.

5) ఎంత వాడు గాని :

ఈ సినిమాలో కూడా వివేక్ గారు మంచి కామెడీని పండించారు.

6) అపరిచితుడు :

రాము(హీరో విక్రమ్) పక్కనే ఉండే పోలీస్ ఆఫీసర్ చారి పాత్రను ఎంతో ఈజ్ తో పోషించారు వివేక్.

7) యముడు :

హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అగ్ని పాత్రలో మంచి కామెడీని పండించారు వివేక్.

8) రఘువరన్ బి.టెక్ :

ఈ చిత్రంలో ధనుష్ తో కలిసి వివేక్ చేసిన కామెడీ సూపర్.

9) శివాజీ :

రజినీ కాంత్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో ఆల్మోస్ట్ సెకండ్ హీరో పాత్రను పోషించారు వివేక్. ఈయన పండించిన కామెడీ కూడా సూపర్.

10) బిగిల్ (తెలుగులో విజిల్) :

అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా హీరో విజయ్ పక్కనే ఉంటూ మంచి కామెడీని పండించారు వివేక్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus