ఈ ఏడాది నిర్మాతలను నిండా ముంచేసిన 10 బాలీవుడ్ సినిమాలు ఏవంటే..?

స్టార్ హీరోలు, క్రేజీ కాంబినేషన్స్, హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్, భారీ బడ్జెట్, రీమేక్స్, బయోపిక్స్.. ఇలా 2022లో బాలీవుడ్‌లో భారీ సినిమాలొచ్చాయి.. దాదాపుగా ఈ రెండేళ్లు హిందీ ఇండస్ట్రీకి అస్సలు కలిసి రాలేదు.. ఎన్నో అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలైతే కనీసం నార్త్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేక బాక్సాఫీస్ బరిలో బొక్కా బోర్లా పడ్డాయి.. నిర్మాతలను నిండా ముంచేశాయి.. నేనంటే నేనంటూ ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపులు కొట్టాయి.. ఈ ఏడాది బాలీవుడ్‌ని బెంబేలెత్తించిన 10 డిజాస్టర్లు.. వాటి బడ్జెట్, కలెక్షన్స్ (గ్రాస్), నష్టాల వివరాలు ఇలా ఉన్నాయి..

1. సామ్రాట్ పృథ్వీరాజ్..

బడ్జెట్ 300 cr
కలెక్షన్స్ 90 cr
నష్టం 210 cr

రాజ్ పుత్ కింగ్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా.. అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్, సోనూ సూద్ ప్రధాన పాత్రధారులుగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ డిజాస్టర్ కా బాప్ అన్నట్టు ఫస్ట్ ప్లేసులో ఉంది..

2. జెర్సీ..

బడ్జెట్ 80 cr
కలెక్షన్స్ 27 cr
నష్టం 53 cr

నాని నటించిన ‘జెర్సీ’ మూవీని హిందీలో షాహిద్ కపూర్‌తో రీమేక్ చేశారు.. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టరే దీన్ని తీశాడు.. కానీ సినిమా జనాలకు ఎక్కలేదు..

3. జయేష్ భాయ్ జోర్దార్..

బడ్జెట్ 90 cr
కలెక్షన్స్ 26 cr
నష్టం 64 cr

రణ్‌వీర్ సింగ్, షాలినీ పాండే నటించిన ‘జయేష్ భాయ్ జోర్దార్’.. ఈ ఏడాది యష్ రాజ్ ఫిలింస్ కొట్టిన మరో భారీ ఫ్లాప్..

4. ఎటాక్..

బడ్జెట్ 80 cr
కలెక్షన్స్ 22 cr
నష్టం 58 cr

జాన్ అబ్రహాం నటించిన యాక్షన్ ఫిలిం ‘ఎటాక్’.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది..

5. హీరో పంతీ 2..

బడ్జెట్ 75 cr
కలెక్షన్స్ 35 cr
నష్టం 30 cr

టైగర్ ష్రాఫ్ నటించిన ‘హీరో పంతీ 2’ మూవీకి క్రిటిక్స్ నుండే కాదు ఆడియన్స్ నుండి కూడా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి.. కథ, కథనాలు.. అనవసరమైన యాక్షన్ సీన్లకు చూసిన వాళ్లు దణ్ణం పెట్టేశారు..

6. థ్యాంక్ గాడ్..

బడ్జెట్ 100 cr
కలెక్షన్స్ 30 cr
నష్టం 70 cr

సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ జంటగా.. అజయ్ దేవ్‌గన్ అతిథి పాత్రలో కనిపించిన ‘థ్యాంక్ గాడ్’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది..

7. ధాకడ్..

 

బడ్జెట్ 80 cr
కలెక్షన్స్ 2.5 cr
నష్టం 82.5 cr

బాలీవుడ్ రెబల్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఫిలిం ‘ధాకడ్’.. కేవలం రూ. 2.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది..

8. షంషేరా..

బడ్జెట్ 180 cr
కలెక్షన్స్ 63 cr
నష్టం 117 cr

రణ్‌బీర్ కపూర్ డ్యుయెల్ రోల్, వాణీ కపూర్ గ్లామర్, సంజయ్ దత్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ‘షంషేరా’ ను కాపాడలేకపోయాయి.. ఈ సినిమాతో యష్ రాజ్ ఫిలింస్ డిజాస్టర్ల పరంగా హ్యాట్రిక్ కొట్టింది..

9. రక్షా బంధన్..

బడ్జెట్ 100 cr
కలెక్షన్స్ 60 cr
నష్టం 40 cr

ఈ ఏడాది అక్షయ్ కుమార్ ఇచ్చిన మరో డిజాస్టర్.. ‘రక్షా బంధన్’.. సినిమా బాగానే అనిపించినా కానీ.. ఔట్ డేటెడ్ స్టోరీ, ఎమోషన్స్ ఎక్కలేదు..

10. లాల్ సింగ్ చద్దా..

బడ్జెట్ 180 cr
కలెక్షన్స్ 120 cr
నష్టం 60 cr

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మరోసారి ‘లాల్ సింగ్ చద్దా’ తో సాలిడ్ షాక్ ఇచ్చాడు.. హాలీవుడ్ క్లాసిక్ ఫిలిం ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్ అయిన ఈ చిత్రంలో నేటివిటీ మిస్ అవడం.. ఎమోషనల్ కంటెంట్ ఎక్కువవడం.. అమీర్ సినిమాల్లో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవడంతో డిజాస్టర్‌గా నిలిచింది..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus