రెండోసారి కూడా హీరోలను మోసం చేసి ప్లాపులు ఇచ్చిన దర్శకులు..!

ఇండస్ట్రీలో దర్శకత్వం చేసే ఛాన్సుల కోసం వందల సంఖ్యలో కుర్రాళ్ళు స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లను దాటుకుని.. కొత్త దర్శకుల వరకు ఆఫర్లు రావడం కష్టంగా ఉండేది. అలాగే హిట్లు ఇచ్చిన దర్శకులు తర్వాత ప్లాపులు ఇచ్చినా… కూడా అవకాశాలు రావడం చాలా కష్టంగా ఉండేది. అయితే కొంతమంది దర్శకులకు మాత్రం క్రేజీ హీరోలు రెండు సార్లు అవకాశాలు ఇచ్చారు. కానీ రెండు సార్లు కూడా ఆ దర్శకులు వాళ్లకు చేదు ఫలితాలనే ఇచ్చారు. అలా హీరో రెండో అవకాశం ఇచ్చినా కూడా ప్లాపులు ఇచ్చిన దర్శకులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) ఎన్టీఆర్ – సురేందర్ రెడ్డి :

సురేందర్ రెడ్డి ‘అతనొక్కడే’ తో టాప్ డైరెక్టర్ల లిస్ట్ లోకి చేరిపోయాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ పిలిచి మరీ ‘అశోక్’ చేసే అవకాశాన్ని ఇచ్చాడు. అది సక్సెస్ కాలేదు. కొన్నాళ్ల తర్వాత కూడా పిలిచి మరీ ‘ఊసరవెల్లి’ చేద్దాం అన్నాడు. ఈ సినిమా కూడా నిరాశపరిచింది.

2) బాలకృష్ణ -క్రిష్ :

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి యావరేజ్ చిత్రాన్ని అందించిన క్రిష్ కు పిలిచి మరీ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు వంటి సినిమాలు డైరెక్ట్ చేసే అవకాశాలు ఇచ్చాడు బాలయ్య. ఈ రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి.

3) రాజ్ తరుణ్ – అనీష్ కృష్ణ :

ఈ కాంబినేషన్లో మొదట ‘లవర్’ అనే సినిమా వచ్చింది. ఇది ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ‘ఇద్దరి లోకం ఒక్కటే’ అనే సినిమా కూడా వచ్చింది. ఇది కూడా ప్లాప్ అయ్యింది.

4) అల్లు అర్జున్ – గుణశేఖర్ : 

మంచి కాంబినేషన్ ఇది..! మొదట ఈ కాంబోలో ‘వరుడు’ వచ్చింది ప్లాప్ అయ్యింది. కొన్నాళ్ల తర్వాత ‘రుద్రమదేవి’ వచ్చింది. ఇది కూడా పెద్దగా ఆడలేదు. కానీ బన్నీ ఇమేజ్ వల్ల భారీ నష్టాల నుండి తప్పించుకోగలిగింది.

5) రాజ్ తరుణ్ – శ్రీనివాస్ గవిరెడ్డి :

ఈ కాంబోలో మొదట ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అనే సినిమా వచ్చింది. ఇది నిరాశపరిచింది. తర్వాత ‘అనుభవించు రాజా’ చేశారు అది కూడా ప్లాప్ అయ్యింది.

6) రవితేజ – రమేష్ వర్మ :

ఈ కాంబోలో మొదట ‘వీర’ వచ్చింది ప్లాప్ అయ్యింది. కొంత గ్యాప్ తర్వాత ‘ఖిలాడి’ వచ్చింది అది కూడా డిజాస్టర్ అయ్యింది.

7) కళ్యాణ్ రామ్ – ఎ మల్లికార్జున్ :

ఈ కాంబోలో మొదట ‘అభిమన్యు’ అనే సినిమా వచ్చింది ప్లాప్ అయ్యింది. కొన్నాల్టికి ‘కత్తి’ అనే సినిమా సో సోగా ఆడినా తర్వాత ‘షేర్’ వచ్చి ఇంకో డిజాస్టర్ గా మిగిలింది.

8) ఎన్టీఆర్ – బి.గోపాల్ :

మొదట ఈ కాంబోలో ‘అల్లరి రాముడు’ వచ్చింది ప్లాప్ అయ్యింది. అటు తర్వాత ‘నరసింహుడు’ వచ్చింది. అది కూడా డిజాస్టర్ అయ్యింది.

9) ప్రభాస్ – పూరి జగన్నాథ్ :

ఈ కాంబోలో మొదట ‘బుజ్జిగాడు’ వచ్చింది యావరేజ్ గా ఆడింది. తర్వాత ‘ఏక్ నిరంజన్’ వచ్చింది ఇది ఫ్లాప్ అయ్యింది.

10) మంచు మనోజ్ – దశరథ్ :

ఈ కాంబోలో మొదట ‘శ్రీ’ అనే సినిమా వచ్చింది అది ఫ్లాప్ అయ్యింది. కొన్నాల్టికి ‘శౌర్య’ అనే సినిమా వచ్చింది. ఇది కూడా డిజాస్టర్ అయ్యింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus