Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » 2016 లో జోరు చూపించిన కథానాయికలు!

2016 లో జోరు చూపించిన కథానాయికలు!

  • December 19, 2016 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2016 లో జోరు చూపించిన కథానాయికలు!

ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినప్పటికీ అందులో అందాల భామ లేకపోతే వెలితిగా అనిపిస్తుంది. అందుకే డైరక్టర్లు కుర్రకారుకి కైపు ఎక్కించే ముద్దుగుమ్మలను సూపర్ గా చూపిస్తుంటారు. హీరోలు యాక్షన్ తో వినోదాన్ని ఇస్తే .. హీరోయిన్లు అందాలతో కనువిందు చేస్తుంటారు. కేవలం స్కిన్ షో నే కాకుండా కాస్తంత అభినయం జోడిస్తే మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. అందుకు అదృష్టం తోడైతే చేతినిండా సినిమాలే. ఇలా 2016 లో హావ సాగించిన స్టార్ హీరోయిన్లు, కొత్త భామలపై ఫోకస్..

టాలీవుడ్ నంబర్ వన్ సమంతSamanthaస్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకోవడమే కాదు.. ఆ పేరుని నిలబెట్టుకోవాలి. నూతన భామల తాకిడి ఎక్కువగా ఉన్న ఈ సమయంలో చాలా కష్టం. తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న సమంత ఈ ఏడాది నాలుగు విజయాలు సొంతం చేసుకొని హావ కొనసాగించింది. తమిళంలో ఆమె నటించిన తేరి, 24 సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో ‘అ ఆ’, ‘జనతా గ్యారేజ్’ లు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దీంతో 2016 టాలీవుడ్ వన్ కిరీటం దక్కించుకుంది. ఆమె నటించిన బ్రహ్మోత్సవం ఒక్కటే నిరాశ పరిచింది.

హ్యాట్రిక్ లక్కీ లేడీ రకుల్Rakul Preetఅతి తక్కువకాలంలో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఈ ఏడాది ఆమె నటించిన తెలుగు చిత్రాలు నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ హ్యాట్రిక్ సాధించడంతో లక్కీ లేడీ గా పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం రకుల్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ తో విన్నర్ మూవీలోనూ అథ్లెట్ గా కనిపించనుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ ఛైతన్యతో కలిసి పని చేస్తోంది. ఇదే జోరు కొనసాగిస్తే రకుల్ 2017 లో టాలీవుడ్ నంబర్ వన్ కిరీటం దక్కించుకోవడం గ్యారంటీ.

క్రేజ్ తగ్గని కాజల్Kajalతెలుగు పరిశ్రమలో ఇప్పుడున్న కథానాయికల్లో సీనియర్ కాజల్ అగర్వాల్. అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఈ భామకి 2016 నిరాశను మిగిల్చింది. ఈ ఏడాది ఆమె నటించిన ‘బ్రహ్మోత్సవం’, ‘సర్దార్ గబ్బర్సింగ్’ చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. అయినా ‘జనతా గ్యారేజ్’లో ప్రత్యేక గీతం చేసి తనకి క్రేజ్ తగ్గలేదని నిరూపించింది. ఖైదీ నంబర్ 150లో మెగాస్టార్ చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసి స్టార్ హీరోయిన్ అని చాటింది.

స్టడీగా తమన్నాTamannaమిల్కీ బ్యూటీ తమన్నా భారీ ప్రాజక్ట్ ల్లో నిమగ్నం కావడంతో దూకుడు తగ్గించింది. మూడు భాషల్లో తెరకెక్కిన ‘అభినేత్రి’లో లీడ్ రోల్ పోషించి ఆకట్టుకుంది. ఊపిరితో హిట్ అందుకుంది. జాగ్వార్, స్పీడున్నోడు లో స్పెషల్ సాంగ్ చేసి అలరించింది. బాహుబలి కంక్లూజన్ షూటింగ్ లో బిజీగా ఉంది. దీని తర్వాత వేగం పెంచనుంది.

అభినయం ఆమె బలంKeerthi Sureshతెలుగు సినిమాల్లో రాణించాలంటే గ్లామర్ ఉంటే సరిపోతుంది… ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు కేవలం అభినయంతోనే చాలామంది రాణిస్తున్నారు. ‘నేను శైలజ’లో అందంగా, అమాయకంగా కనిపించింది కీర్తి సురేష్. ఆ ఒక్క సినిమాతోనే కీర్తి పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ‘నేను లోకల్’ కోసం నానితో జోడీ కట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రాల్లో కథానాయికగా అవకాశాన్ని అందుకొంది. ఈ సినిమాల్లో ఒక్కటి హిట్ అయినా కీర్తి తన కీర్తిని అమాంతం పెంచేసుకోవడం ఖాయం.

అచ్చమైన తెలుగు ఆడపచులా..Anupama Parameshwaranఅలల్లా జాలువారే ఉంగరాల జుట్టుతో యువత హృదయాలను కట్టిపడేసిన అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. తెలుగులో “అ ఆ” సినిమాతో అడుగుపెట్టిన ఈ సుందరి సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని … అచ్చమైన తెలుగు ఆడపడుచు అని పేరు తెచ్చుకుంది. ప్రేమమ్ తో మ్యాజిక్ చేసి కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది. ప్రస్తుతం ఈ కేరళ కుట్టీ ‘శతమానం భవతి’లో నటిస్తోంది.

చిన్న సినిమాకి పెద్ద స్టార్Hebah Patelచిన్న సినిమాల్లో పెద్ద స్టార్ అయిపోయింది హెబ్బా పటేల్. ఈ ఏడాది ఆమె నటించిన ‘ఈడోరకం ఆడోరకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్’ సినిమాలు విడుదల అయ్యాయి. ముందు రెండు చిత్రాలు నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టాయి. తాజాగా రిలీజ్ అయిన ‘నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్’ కూడా యావేరేజ్ ఫిల్మ్ గా టాక్ తెచ్చుకుంది. ఈమె బోల్డ్ గా నటిస్తూ స్టార్ హీరోయిన్లకు గుబులు పుట్టిస్తోంది. వచ్చే ఏడాది కూడా హెబ్బా ‘మిస్టర్’, ‘అంధగాడు’, ‘ఏంజిల్’ చిత్రాలతో పోటీకి సిద్ధంగా ఉంది.

హిట్ బాటలోనే లావణ్యLavanya Tripatiలావణ్య త్రిపాఠికి ఈ ఏడాది రెండు విజయాలు దక్కాయి. ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘శ్రీరస్తు శుభమస్తు’ హిట్ బాటలో నడిపించాయి. ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ మాత్రమే లెక్క తప్పింది. ప్రస్తుతం రెండు తమిళ చిత్రాలతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘మిస్టర్’ సినిమాలోనూ నటిస్తోంది.

కామెడీ క్వీన్ రాశీ ఖన్నాRashi khannaఅందం, అభినయం తో పాటు నవ్వించ గలిగిన హీరోయిన్ గా రాశీ ఖన్నా పేరు తెచ్చుకుంది. ‘సుప్రీమ్’ లో ఆమె కామెడీ టైమింగ్ తో కేక పుట్టించింది. ‘హైపర్’లో ఎనర్జిటిక్ హీరో రామ్ స్పీడ్ అందుకొని రాశీఖన్నా తన జోరు చూపించింది.

దూకుడుగా ప్రగ్యాPragya Jaiswalగతేడాది ‘కంచె’తో ఆకట్టుకొన్న ప్రగ్యా జైస్వాల్ ఈ ఏడాది థియేటర్లోకి రాలేదు. అయినా మరో గొప్ప చిత్రంలో నటిస్తోంది. కింగ్ నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’లో వినూత్న పాత్రలో ఆకట్టుకోనుంది. మనోజ్, తో కలిసి ‘గుంటూరోడు’ సినిమాలో నటించింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. బెల్లం కొండ సాయి శ్రీనివాస్ చిత్రంలోనూ ప్రగ్యా కథానాయికగా నటిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #a.aa.. movie
  • #Actress Kajal Aggarwal
  • #Actress Lavanya Tripathi
  • #Actress Rakul Preet
  • #Actress Rashi Khanna

Also Read

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

related news

Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

2 hours ago
Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

2 hours ago
Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

5 hours ago
Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

5 hours ago
Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

6 hours ago

latest news

M.M.Keeravani : మరో అరుదైన అవకాశం దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి.. అదేంటంటే..?

M.M.Keeravani : మరో అరుదైన అవకాశం దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి.. అదేంటంటే..?

22 mins ago
Prabhas: బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత రిజెక్ట్‌ చేసిన ప్రభాస్‌.. ఏ మూవీ అంటే?

Prabhas: బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత రిజెక్ట్‌ చేసిన ప్రభాస్‌.. ఏ మూవీ అంటే?

1 hour ago
Keerthy Suresh: కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

Keerthy Suresh: కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

2 hours ago
Prabhas: ప్రభాస్, సుకుమార్.. అసలు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందా?

Prabhas: ప్రభాస్, సుకుమార్.. అసలు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందా?

2 hours ago
Mrunal Thakur: టీమ్‌ నో చెబుతోంది.. ఈమె ఆయన పాటలు పెడుతోంది.. మృణాల్‌ ప్లానేంటి?

Mrunal Thakur: టీమ్‌ నో చెబుతోంది.. ఈమె ఆయన పాటలు పెడుతోంది.. మృణాల్‌ ప్లానేంటి?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version