టాటూతో ట్రెండ్ సృష్టించిన తెలుగు హీరోలు

ఇష్టమైన వారి పేర్లు.. గుర్తులను బాడీ పై వేసుకోవడం చాలామందికి ఇష్టం. ఈ టాటూస్ ని సినీ స్టార్లు వేసుకోవడంతో మరింతమందికి వీటిపై క్రేజ్ పెరిగింది. రొటీన్ కి భిన్నంగా స్టార్లు టాటూస్ వేసుకొని మరింత అందంగా కనిపించారు. ట్రెండ్ సృష్టించారు. అలా టాటూస్ తో అదరగొట్టిన హీరోలపై ఫోకస్..

నాగార్జున (శివమణి)టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున శివమణి చిత్రంలో భుజం పైన టాటూతో కనిపించి ఆకట్టుకున్నారు.

ప్రభాస్ (ఏక్ నిరంజన్, మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి )యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ఏక్ నిరంజన్ సినిమాలో చేతిపై విదీశీ భాషలో టాటూ వేసుకున్నారు. అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో చేతిపై టాటూ వేసుకున్నారు. బాహుబలి చిత్రంలోనూ మహేంద్ర బాహుబలి క్యారెక్టర్ నుదిటిపై బొట్టుగానూ, చేతిపైనా టాటూ వేసుకున్నారు.

ఎన్టీఆర్ (ఊసరవెల్లి, టెంపర్ )ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ మెడపైన టోనీ అనే ఆంగ్ల అక్షరాలను టాటూగా వేసుకున్నారు. టెంపర్ లోను ఎన్టీఆర్ టాటూతో స్టైల్ గా కనిపించారు.

అల్లు అర్జున్ (ఇద్దరమ్మాయిలతో) అల్లు అర్జున్ తోను పూరి జగన్నాథ్ టాటూ వేయించారు. ఇద్దరమ్మాయిలతో సినిమాలో బన్నీ చేతిపై టాటూతో కనిపించారు.

నాని (కృష్ణ గాడి వీర ప్రేమ గాధ)నేచురల్ స్టార్ నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రంలో బాలయ్య అభిమానిగా నటించడమే కాదు.. ఆ పేరుని చేతిపై వేసుకున్నారు.

శర్వానంద్ (ఎక్స్ ప్రెస్ రాజా )యువ హీరో శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా చిత్రంలో చేతిపై టాటూతో లేడీ అభిమానులను పెంచుకున్నారు.

మహేష్ బాబు (1 నేనొక్కడినే )టాటూలకు దూరంగా ఉండే మహేష్ బాబు తాను రాక్ స్టార్ గా నటించిన 1 నేనొక్కడినే మూవీలో చేతిపై టాటూతో కనిపించారు.

రామ్ చరణ్ (బ్రూస్ లీ ) శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన బ్రూస్లీ చిత్రంలో చేతిపై నిప్పులు చెరుగుతూ పరిగెత్తుతున్న టాటూ ని వేసుకున్నారు.

మంచు విష్ణు (డైనమైట్ )మంచు విష్ణు తాజా చిత్రం డైనమైట్ లో కండలు తిరిగిన చేతిపై టాటూ వేసుకొని అదరగొట్టారు.

బాల కృష్ణ (లెజెండ్) ఓం అక్షరానికి కత్తులు కలిగిన ఆకారాన్ని మేడపైన టాటూగా వేసుకొని బాలకృష్ణ లెజెండ్ సినిమాలో గంభీరంగా కనిపించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus