Shaakuntalam: ‘శాకుంతలం’ కి ప్లాప్ టాక్ రావడానికి ఈ 10 మైనస్సులే కారణమా..?

‘యశోద’ తర్వాత సమంత నుండి వచ్చిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘శాకుంతలం’. సీనియర్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు అనగా ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యింది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ సమర్పణలో ‘గుణ టీం వర్క్స్’ బ్యానర్ పై దిల్ రాజు, నీలిమ గుణ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ని ఆధారం చేసుకుని దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందించారు. సమంత వరుస హిట్స్ తో ఫామ్లో ఉండటం వల్లే ‘శాకుంతలం’ పై జనాల దృష్టి పడింది. అంతేగాని టీజర్, ట్రైలర్లు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ పెద్దగా ఏమీ లేదు. ఇక ఈ చిత్రానికి మొదటి షో నుండే ప్లాప్ టాక్ వస్తుండడం గమనార్హం. అందుకు కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) దుష్యంతుడు -శకుంతల మధ్య చిగురించిన అందమైన ప్రేమ కథ చివరికి ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అన్నది మెయిన్ పాయింట్ గా ‘శాకుంతలం’ ని ఆవిష్కరించాడు దర్శకుడు గుణశేఖర్. లైన్ బాగుంది. కానీ ఆ కథని వేగంగా ఆకట్టుకునే విధంగా అయితే అతను తీర్చిదిద్దలేదు.

2) ఇలాంటి కథకి సమంతని ఎంపిక చేసుకోవడం గుణశేఖర్ చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ఎందుకంటే ఆమెలో క్యూట్ నెస్ ఉంటుంది. కానీ ఇంత బరువైన పాత్రను మోయగల స్టామినా ఆమెకు లేదు. ఆమె ఎంత బాగా నటించాలి అనుకున్నా.. ఆమెలో శకుంతల కనిపించదు. ‘ఏ మాయ చేసావే’ లో జెస్సీనే కనిపిస్తూ ఉంటుంది. గట్టిగా ఈమెకు సినిమాలో ఒక పేజీ డైలాగులు కూడా ఉండవు. ఇక శకుంతలను గుర్తు చేసి ఆమె ప్రపంచంలోకి జనాలను తీసుకెళ్లడంలో పూర్తిగా తేలిపోయింది. ఈ మధ్య కాలంలో సమంత న్యాయం చేయని పాత్ర.. ఈ శకుంతల పాత్ర అని చెప్పొచ్చు.

3) ఒక అందమైన, భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమ కథని అందంగా చెప్పాలనే ప్రయత్నమే కానీ.. ఆకట్టుకునేలా చెప్పాలనే ప్రయత్నం దర్శకుడు గుణశేఖర్ ఎంత మాత్రం చేయలేదు.




4)ఈ సినిమాని 3D లో చూడాలి అని టీం చెప్పడం కూడా ఓ పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో అంత విషయం లేదు. పైగా టీం ఇలా చెప్పడం వల్ల 2D లో ‘శాకుంతలం’ ని చూడాలనుకున్న జనాల ఇంట్రెస్ట్ ను కూడా పోగొట్టినట్టు అయ్యింది.




5) వి.ఎఫ్.ఎక్స్ కోసం ఇంకాస్త టైం తీసుకున్నట్లు గుణశేఖర్, దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ అత్యంత నాసిరకంగా ఉన్నాయి. ఓ కార్టూన్ చిత్రాన్ని చూస్తున్న ఫీలింగ్ ను కలిగించాయి.




6) యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మరీ పేలవంగా ఉన్నాయి. యుద్ధం జరుగుతున్నప్పటికీ.. ప్రేక్షకులకు ఏదో టీవీ యాడ్ చూస్తున్న ఫీలింగ్ ను కలిగించారు. ఓ సందర్భంలో ఎవరు ఎవర్ని కొడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి.




7) శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ కన్నుల విందు చేయలేకపోయింది. భారీ తనాన్ని ఎక్కడా కూడా చూపించలేకపోయింది అని చెప్పాలి.




8) సినిమాలో దుష్యంత మహారాజుగా చేసిన దేవ్ మోహన్, దుర్వాస మహర్షి గా చేసిన మోహన్ బాబు తప్ప.. మిగిలిన పాత్రలు ఏమాత్రం గుర్తుండవు. సమంతతో సహా మిగిలిన క్యాస్టింగ్ ను దర్శకుడు సరిగ్గా వాడలేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా గౌతమి, ప్రకాష్ రాజ్, శివ బాలాజీ వంటి వారి పాత్రలు ఏదో భారీతనం పెట్టినట్టున్నాయి తప్ప.. వారి పాత్రలు పండలేదు అని చెప్పాలి.




9) ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాలో అల్లు అర్హ నటిస్తుంది అని చెప్పకుండా సర్ప్రైజ్ చేసుంటే బాగుండేది. ఎందుకంటే ఈ చిత్రంలో ఆ పాప భరతుడి పాత్ర అంటే బాలుడి పాత్ర వేసినట్టు. కానీ అర్హ కాబట్టి.. భరతుడు అనే బాలుడిని చూస్తున్నట్టు అనిపించలేదు. అలాగే ఈ సినిమాలో సమంత పాత్రలో రెండో షేడ్ ఉంటుంది.. ఆత్మగౌరవం కోసం మొండిగా ఉండే ఓ అమ్మాయిలా ఆమె కనిపిస్తుంది అన్నాడు దర్శకుడు. అలాంటి కాన్సెప్ట్ జస్ట్ అర సీన్ లో లేపేశాడు.




10) మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు జనాలకు ఎక్కలేదు. మల్లిక మల్లిక పాట కాస్తో కూస్తో ఓకే అనిపిస్తుంది అంతే..!





Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus