ఈ 10 మైనస్సులు లేకపోతే సినిమాకి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చేవి..!

  • September 23, 2022 / 07:45 PM IST

గతేడాది ‘రాజ రాజ చోర’ చిత్రంతో హిట్టు కొట్టిన శ్రీవిష్ణు కి ఆ వెంటనే ‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ వంటి ఫ్లాప్ లు పలకరించాయి. అయితే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘అల్లూరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫైనాన్సియల్ సెటిల్మెంట్లు పూర్తి కాకపోవడం వల్ల ఈ చిత్రం మార్నింగ్ షోలు పడలేదు. మ్యాట్నీ ల నుండి ఈ చిత్రం ప్రదర్శితమయ్యింది. ఇక ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘లక్కీ మీడియా’ బ్యానర్‌ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించగా… బెక్కెం బబిత సమర్పకులుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి పర్వాలేదనిపించే టాక్ వస్తుంది కానీ కొన్ని మైనస్ లు లేకపోతే బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చేవని చెప్పాలి. ఆ మైనస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ముందుగా కథగా చెప్పుకుంటే.. ‘అల్లూరి’ కథ ఏమీ ఉండదు. హీరో ఓ పోలీస్. అతని దూకుడు ని తట్టుకోలేక లోకల్ రౌడీలు, రాజకీయ నాయకలు వేరు వేరు ప్రదేశాలకు అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఈ క్రమంలో అతని వ్యక్తిగత జీవితానికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని అతను ఎదుర్కున్నాడు అనేది కథ. ఇదే కథ అని చెబితే ఎవ్వరూ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇదే మైనస్ అని చెప్పాలి. అయితే దర్శకుడు టేకింగ్ తో జనాలను కూర్చోబెడతాడు.

2) ముందు నుండి శ్రీవిష్ణు ని సాఫ్ట్ రోల్స్ లో చూడటం వల్లో లేక అతను చేసిన ‘మా అబ్బాయి’ ‘వీర భోగ వసంత రాయలు’ వంటి చిత్రాలు సక్సెస్ కాకపోవడం వల్లనో ఏమో కానీ.. ఇలాంటి పవర్ఫుల్ రోల్ కు అతను సూట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. అతని బదులు ఇంకా క్రేజ్ ఉన్న హీరో అయితే బాగుణ్ణు అని కూడా అనిపిస్తుంది. అయితే శ్రీ విష్ణు తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి బాగా నటించాడు.

3) ఫస్ట్ హాఫ్ అనేది ఫుల్ కమర్షియల్ ప్యాకేజీ, ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంటుంది కానీ ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.

4) సెకండ్ హాఫ్ లో విలన్లు, పోలీస్ అయిన హీరో సవాళ్లు చేయడం వంటివి ఉండవు. టెర్రరిస్ట్ ల నేపథ్యం వస్తుంది కాబట్టి సినిమా స్లో గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

5) అల్లూరి అనే టైటిల్ పెట్టారనో ఏమో కానీ సెకండ్ హాఫ్ లో అల్లూరి సీతారామ రాజు వ్యక్తిగత జీవితం గురించి డీటెయిలింగ్ పెట్టారు. అది కూడా సినిమా స్లో అయిన ఫీలింగ్ ను కలిగిస్తుంది.

6) సినిమా నిడివి 2 గంటల 49 నిమిషాలు ఉండటం కొంత మైనస్ అని చెప్పాలి. కత్తెరకి పని చేయాల్సిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇది మేజర్ మైనస్ అని చెప్పాలి. చిన్న సినిమాలకు రన్ టైం ఎక్కువగా ఉంటే టికెట్లు బుక్ అవ్వవు అనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది.

7) హీరోయిన్ కాయదు లోహర్ పాత్రకు ప్రాముఖ్యత అంతంత మాత్రమే..!

8) విలన్ ట్రాక్స్ ను అర్ధాంతరంగా ముగించిన ఫీలింగ్ కూడా కలుగుతుంది.

9) సెకండ్ హాఫ్ లో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ.. సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉండడం వల్ల ఆ ఫీల్ మిస్ అవుతుంది.

10) పాటలు జనాలకు కనీసం గుర్తుండవు. నేపథ్య సంగీతం కూడా సో సో గా ఉంటుంది. మాస్ సినిమాలకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అవసరం.

ఈ మైనస్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే.. మొదటి షో నుండి ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ నమోదయ్యేది. ఇప్పుడైనా ఈ వీకెండ్ కు హ్యాపీగా ట్రై చేయొచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus