కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ `K-RAMP`. జెయిన్స్ నాని దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ను రాజేష్ దండా నిర్మించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది.అక్టోబర్ 18న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్ అబ్బవరం గతేడాది ‘క’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో `K-RAMP`పై ట్రేడ్లో అంచనాలు ఏర్పడ్డాయి.
టీజర్, ట్రైలర్స్ అయితే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు కానీ ‘క’ సెంటిమెంట్ తో సినిమాపై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. అక్టోబర్ 18న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ తీసుకుంది.2వ రోజు కూడా పర్వాలేదు అనిపించింది.
ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 1.23 cr |
సీడెడ్ | 0.42 cr |
ఆంధ్ర(టోటల్) | 1.38 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 3.03 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.40 cr |
ఓవర్సీస్ | 0.65 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 4.08 కోట్లు(షేర్) |
`K-RAMP`సినిమాకి రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.4.08 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.7.5 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.3.42 కోట్లు షేర్ ను రాబట్టాలి. దీపావళి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి.. ఈ సినిమా మరింతగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.