Sreeleela: శ్రీలీల దీపావళి సరదాలు తెలుసా? పండగ గురించి మెసేజ్‌ కూడా అదుర్స్‌

చిచ్చుబుడ్డిలా కెరీర్‌ను ప్రారంభించి థౌజండ్‌ వాలా తన అందచందాలు, డ్యాన్స్‌లతో మైమరిపిస్తున్న శ్రీలీల ఇప్పుడు పక్క పరిశ్రమలోకి వెళ్లి తన టాలెంట్‌ను చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె దీపావళి సరదాలు కూడా తెలుసుకుందామా. ఎలా దీపావళి జరుపుకునేది, ఇప్పుడు ఎలా చేసుకుంటోంది అనే వివరాలను ఇటీవల ఓ మీడియాతో పంచుకుంది శ్రీలీల. దీపావళికి ఇంటిని అందంగా అలంకరించుకోవడమంటే ఇష్టమని చెప్పిన శ్రీలీల.. చీకటి పడ్డాక ఇంట్లోని లైట్స్‌ ఆపి.. ఆ దీపాలకాంతుల్లో గడిపేవాళ్లమని నాటి రోజుల్ని గుర్తు చేసుకుంది.

Sreeleela

ఇక తనకు టపాసులంటే భయమని, ఎవరైనా పెద్ద బాంబులు పేలుస్తున్నారంటే దగ్గరగా ఉండేది కాదట. కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్డులు, భూచక్రాలు మాత్రం కాల్చేదట. ఆమె అన్నయ్యలు మాత్రం పెద్ద పెద్ద బాంబులు కాల్చేవారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో పండగ సందర్భంగా ఓ సందేశం కూడా ఇచ్చింది. టపాసులు కాల్చే సమయానికి ఇంట్లో కుక్కలను ఓ రూమ్‌లో పెట్టి తలుపులన్నీ వేస్తుందట. పేలుడు శబ్దాలు శునకాలకు ఇబ్బంది పెడతాయని.. అలా చేసేదట.

ఇక రోడ్డు మీద ఎవరైనా బాంబులు కాలుస్తుంటే శ్రీలీలకు భయంగా ఉంటుందట. చాలా వీధి కుక్కలు, మూగ జీవాలు పండగ రోజు కాలిన గాయాలతో కనిపిస్తే బాధగా అనిపిస్తుందట. అందుకే టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి అని కోరింది. ఇక మిమ్మల్ని టపాసులతో పోల్చుకోండి అంటే ఏమంటారు అని అడిగితే.. అమ్మ అయితే నన్ను మా ఇంటికి అఖండ దీపం అని అంటూ ఉంటుంది. కానీ మా అన్నయ్యలు నన్ను చిచ్చుబుడ్డితో పోలుస్తుంటారు అని చెప్పుకొచ్చింది.

ఇన్ని చెప్పి సినిమా సంగతులు చెప్పకపోతే ఎలా.. ఆమె నుండి త్వరలో రాబోయే సినిమా సంగతి చూస్తే.. రవితేజ ‘మాస్‌ జాతర’ సినిమాతో త్వరలో రాబోతోంది లీల. ఈ సినిమాలో శ్రీకాకుళం అమ్మాయిగా కనిపిస్తుందట. టీచర్‌గా రవితేజతో కలసి ఏం చేసింది అనేది సినిమానట. చాలా వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమైన ఈ సినిమా అక్టోబరు 31న విడుదలవుతోంది.

 మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేకయిన ‘మిత్ర మండలి’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus