సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘తెలుసు కదా’. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ చిత్రంతో డైరెక్టర్ గా మారారు. తమన్ సంగీతంలో రూపొందిన ‘మల్లిక గంధ’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది. సినిమాకి కొంత పబ్లిసిటీ తీసుకొచ్చింది. టీజర్, ట్రైలర్ ఓకే అనిపించాయి.. కానీ సినిమాకి బజ్ తీసుకురాలేదు. కేవలం సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్, మౌత్ టాక్ పై ఆధారపడి అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.
‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుంది అన్నారు. ఇంకొంతమంది బాలేదు అన్నారు. ఓపెనింగ్స్ కూడా సో సో గానే వచ్చాయి.ఒక విధంగా తీసిపారేసే విధంగా లేవు.. కానీ ఎక్కువ బిజినెస్ జరగడం వల్ల బ్రేక్ ఈవెన్ కి ఇవి సరిపోవు అనే చెప్పాలి.
ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.55 cr |
సీడెడ్ | 0.32 cr |
ఆంధ్ర(టోటల్) | 1.20 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 3.07 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.28 cr |
ఓవర్సీస్ | 1.17 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 4.52 కోట్లు(షేర్) |
‘తెలుసు కదా’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.19.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.20 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.4.52 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.8.3 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.15.48 కోట్ల షేర్ ను రాబట్టాలి.