రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కిన డివోషనల్ అండ్ ఫాంటసీ మూవీ ‘కాంతార చాప్టర్ 1’ రిలీజ్ అయ్యి 2 వారాలు దాటింది. ‘కాంతార’ సూపర్ హిట్ అవ్వడంతో ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిషబ్ శెట్టినే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు. దీనికి కూడా హిట్ టాక్ వచ్చింది. అందువల్ల సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ వీకెండ్ ముగిశాక ఈ సినిమా కలెక్షన్స్ కూడా తగ్గాయి.
‘కాంతార’ హిట్ అవ్వడంతో ‘కాంతార చాప్టర్ 1’ ని పాన్ ఇండియా లెవెల్లో భారీ లెవెల్లో రిలీజ్ చేశారు. అన్ని ఏరియాల్లోనూ భారీ రేట్లకు విక్రయించారు. అందువల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది కానీ దీపావళికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండటం వల్ల.. ‘కాంతార చాప్టర్ 1’ కి ఎక్కువ థియేటర్స్ మిగల్లేదు. ఉన్నవాటిలో డీసెంట్ రన్ కొనసాగిస్తుంది.
ఒకసారి 18 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 29.18 cr |
సీడెడ్ | 9.17 cr |
ఉత్తరాంధ్ర | 8.45 cr |
ఈస్ట్ | 3.57 cr |
వెస్ట్ | 2.66 cr |
గుంటూరు | 3.85 cr |
కృష్ణా | 3.91 cr |
నెల్లూరు | 2.01 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 62.8 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.50 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 64.3 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్) |
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం తెలుగు వెర్షన్ కి ఏకంగా రూ.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 18 రోజుల్లో ‘కాంతార చాప్టర్ 1’ రూ.64.3 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.114.10 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.21.7 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇప్పటికీ స్టడీగా కలెక్ట్ చేస్తుంది. కానీ కొత్త సినిమాలతో పోటీ పడి ఎంత వరకు నిలబడుతుందో చూడాలి