మనం చిన్నప్పటి నుంచి అనేక ప్రేమ కథల సినిమాలు చూసి ఉంటాం. వాటన్నింటిని గుర్తుపెట్టుకోలేము. కాని కొన్ని మాత్రం మన మదిలో నిలిచి పోతాయి. అలా నేటి తరం యువకులను ఆకట్టుకున్న ప్రేమ చిత్రాలలో కొన్నింటి గురించి వివరిస్తున్నాం. వీటిని మిస్ కాకండి.
నా ప్రేమను ఫీల్ అయితే చాలు.. అంటూ అనిత వెంట పడే ఆర్య ప్రేమించే స్టైలే వేరు. స్వచ్ఛమైన ప్రేమను అందిస్తే ఎంతటి వారైనా తిరిగి ప్రేమిస్తారనే సత్యాన్ని తన కథ ద్వారా చాటి చెప్పాడు.
ప్రేమ రాజు పేద అనే తేడా చూసుకుని పుట్టదు. ఎవరి మధ్యనైనా ఎప్పుడైనా పుడుతుందని ఈ చిత్రం చెబుతుంది…. మిలియనీర్ సంతోష్.. పేద అమ్మాయి సిరిని ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. వీరిద్దరి ప్రేమకి సిరి అన్నయ్య శివరామ కృష్ణ అడ్డుపడతాడు. ఏమిచేస్తే నా ప్రేమ నిజమని నమ్ముతారని శివరామ కృష్ణని సంతోష్ అడుగుతాడు. అతను ఒక పందెం పెడుతాడు. ఎంతో కష్టపడి ఆ పందెంలో గెలిచి సిరి ని సొంతం చేసుకుంటాడు. ఒక మిలియనీర్ ప్రేమ కోసం పేడ ఎత్తడం, గొడ్డు కారం తినడం చూస్తుంటే మనసు చలిచ కుండా ఉండదు.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన కార్తిక్ తన కంటే వయసులో పెద్దది అయినా జెస్సిని ప్రేమిస్తాడు. తనని ప్రేమించేలా చేసుకుంటాడు. వీరి రెండు కుటుంబాల కులాలు, ప్రాంతాలు వేరు. దీంతో ఒప్పుకోరు. గొడవలు అవుతాయి. అయినా తన ప్రేమ మీద నమ్మకంతో ఇరు కుటుంబాలను ఒప్పిస్తాడు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని చాటే ఈ స్టోరీ యువత హృదయాలను గెలుచుకుంది.
కొత్తగా పెళ్లి అయినా జంట. వీరిద్దరి మధ్య ప్రేమ ఉండదు. భార్యకు ఇది వరకు ఒక లవ్ స్టోరీ ఉందని తెలుసుకుంటాడు. డైవర్స్ ఇచ్చి భార్యను ఆమె ప్రేమించిన వ్యక్తి వద్దకు పంపించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో భర్తకు ఇదివరకు ఒక లవ్ స్టోరీ ఉందని, ఆమె చచ్చి పోయిందని భార్య తెలుసుకుంటుంది. అప్పుడు భర్త ఫై ప్రేమ కలుగుతుంది. కాని చెప్పలేక పోతుంది. చివరికి భార్య తనని ప్రేమిస్తోందని తెలుసుకుంటాడు. ప్రేమించుకునే భార్య భర్తలుగా కలిసిబతుకుతారు. పెళ్లి అయినా తర్వాత ప్రేమ పుట్టటం అద్భుతంగా ఉంటుంది.
తను ప్రేమించిన అమ్మాయి మరో కొద్ది రోజుల్లో చనిపోతుందని తెలుసుకుని ప్రేమికుడు విలపిస్తాడు. ప్రియురాలు ప్రాణం వదిలే సమయం లోపల ఆమె కోరికలన్నింటిని తీరుస్తాడు. ఉన్న కొంత సమయంలోనే ఆమెకు ఎంతో లైఫ్ ని చూపిస్తాడు. ప్రేమ అంటే కోరుకోవడం కాదు ఇవ్వడమని ఈ సినిమాలో చెబుతారు.
కులాలు వేరు అయినా అబ్బాయి అమ్మాయి మనసులు ఒక్కటవుతాయి. ఈ ప్రేమ విషయం అమ్మాయి తండ్రికి తెలిసి వేరే అబ్బాయి తో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తాడు. అమ్మాయి ఒప్పుకోదు. అవమానంతో తండ్రి చచ్చిపోతాడు. దీంతో ఆమె పెళ్లి చేసుకోదు. ఆమె ఆచూకి తెలియక అతను కూడా పెళ్లి చేసుకోడు. ప్రేమించడమంటే పెళ్లి చేసుకున్నట్లే అని ఇద్దరు నమ్ముతారు. మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత కలుసుకుని భార్య భర్తలవుతారు.
చిన్ననాటి స్నేహితురాలు నందినిని ప్రేమిస్తాడు ప్రభ. అయితే ప్రభ ని మరో అమ్మాయి ప్రేమిస్తుంది. ఆమెను వదిలించుకోవడానికి నందినికి తనకి మధ్య ప్రేమ ఉందని ఉత్తుత్తి కథ చెబుతాడు. ఆ కథను తెలుసు కున్ననందిని కూడా ప్రభను ప్రేమిస్తుంది. నందిని తనని ప్రేమిస్తోందని తెలిసినా కూడా తండ్రి మాట కోసం ప్రభ ఆమెకు దూరంగా వెళ్లిపోవాలనుకుంటాడు. కాని వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమే వీరిని ఒకటి చేస్తుంది.
ప్రేమ పుట్టేందుకు ఒకరినొకరు చూసుకొనవసరం లేదని, కలిసి తిరగనవసరం లేదని ఈ స్టోరీ మంకు తెలుపుతుంది.
(కార్తిక్ శ్రుతి అనే అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమలో దించడానికి ఫోన్ నంబర్ సంపాదిస్తాడు. నంబర్ మారి పోయి శ్రావణి అనే అమ్మాయికి కనెక్ట్ అవుతుంది. తాను చూసిన అమ్మాయి తోనే మాట్లాడుతున్నానని అనుకుంటాడు. కాదని కొంతకాలానికి తెలుస్తుంది. అప్పటికే శ్రావణిని అవమాన పరుస్తాడు. దీంతో ఆమె కార్తిక్ ఫై రివేంజ్ తీసుకోవాలని ప్లాన్ వేస్తుంది. బాస్ గా వచ్చి కార్తిక్ ని టీజ్ చేస్తుంది. ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది. ఈ క్రమంలో ఇది వరకే తాను శ్రావణి తో ప్రేమలో పడినట్లు కార్తిక్ తెలుసుకుంటాడు. బాస్ ప్రేమని కాదని .. శ్రావణి కావాలని బాస్ కె చెబుతాడు. ఈ స్టోరీ చూడ్డానికి చాలా బాగుంటుంది.)
కొత్తగా పెళ్లి అయినా దంపతులలో భార్యకి భర్త కన్నా ప్రియుడి పైనే ప్రేమ ఉంటుంది. తన భార్యను ప్రేమించిన వ్యక్తి గురించి తెలుకోవాలని భర్త బయలు దేరుతాడు. ఆ వ్యక్తి తన పెళ్ళాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకుని షాక్ అవుతాడు. ఈ ప్రేముకులను కలపాలని తాను మరణిస్తాడు.
ఎవరి ప్రేమ అయినా కొంత కాలానికి తగ్గి పోతుంది నా ప్రేమ మాత్రం తరిగిపోదు. నాదీ ఓ రేంజ్ లవ్ స్టోరీ అనే కథ తో సాగిన ఆరెంజ్ సినిమా కూడా ప్రేమికులు చూడాల్సిన సినిమా జాబితాలో ఉంది.