Naga Chaitanya: నాగ చైతన్య ఇంటి నుండి కార్స్, బైక్స్ కాస్ట్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా.. ‘కింగ్’ నాగార్జున నట వారసుడిగా అక్కినేని ఫ్యామిలీ నుండి థర్డ్ జెనరేషన్ హీరోగా ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. పర్సనల్‌గా జిమ్, యోగా, స్పోర్ట్స్‌తో పాటు.. బైక్, కార్ రేసింగ్ అంటే యమ క్రేజీ.. చైతన్య గ్యారేజీలో రకరకాల స్పోర్ట్స్ బైక్స్ అండ్ కార్స్ ఉన్నాయి.. రోడ్లు ఖాళీగా ఉండే టైం చూసుకుని.. హెల్మెట్ పెట్టుకుని హైదరాబాద్ రోడ్ల మీద రయ్ మంటూ దూసుకెళ్లడమంటే భలే ఇష్టం తనకి.. చైతు ఇంటి నుండి కార్స్, బైక్స్ వంటి 11 వాల్యుబుల్ థింగ్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. లావిష్ హౌస్ – అపార్ట్‌మెంట్..

చైతన్యకి హైదరాబాద్‌లో లావిష్ హౌస్‌తో పాటు స్కై వ్యూ అపార్ట్‌మెంట్ కూడా ఉంది.. దీని ప్రజెంట్ మార్కెట్ వాల్యూ రూ. 80 నుండి 100 కోట్లు..

2. అన్నపూర్ణ స్టూడియోస్‌లో షేర్..

తాత ఏఎన్నార్ నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రొడక్షన్ హౌస్‌లోనూ చైకి షేర్ ఉంది..

3. లగ్జరీ జీప్..

చైతన్య దగ్గరున్న మెర్సిడెస్ జి వాగన్ జీప్ కాస్ట్ రూ. 2.55 కోట్లు..

4. రేంజ్‌కి తగ్గ రేంజ్ రోవర్..

చైతు గ్యారేజ్‌లో రూ. 2.5 కోట్లు విలువ చేసే లగ్జీరియస్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కార్ ఉంది..

5. ఫేవరెట్ కార్..

తన దగ్గర నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కార్ ఉంది.. రేసింగ్ అంటే ఇష్టంతో రూ. 2.5 కోట్లతో ఈ కార్ కొన్నాడు..

6. స్వాంకీ బీఎండబ్ల్యూ..

స్వాంకీ బీఎండబ్ల్యూ ఎమ్ 6 కాస్ట్ రూ. 1.8 కోట్లు..

7. ఫెరారీ ఎఫ్ 488..

రూ. 1. 75 కోట్ల ఖరీదు చేసే ఫెరారీ ఎఫ్ 488 స్పోర్ట్స్ కార్ కూడా ఉంది..

8. ప్రీమియం స్పోర్ట్స్ బైక్..

కేవలం కార్లే కాదు.. చైతన్యకి బైక్ రేసింగ్ అంటే కూాడా చాలా ఇష్టం.. ఎమ్‌వి ఆగస్టా ఎఫ్ 4 బైక్‌ని రూ. 35 లక్షలతో సొంతం చేసుకున్నాడు..

9. బీఎండబ్ల్యూ బైక్..

బీఎండబ్ల్యూ కార్‌తో పాటు.. బీఎండబ్ల్యూ ఆర్ 9 టి బైక్ కూడా ఉంది. దీని రేటు రూ. 20 లక్షలు..

10. మరో క్రేజీ బైక్..

చైతన్య గ్యారేజ్‌లో ఉండే ట్రయంఫ్ థ్రక్స్టన్ ఆర్ బైక్ కాస్ట్ రూ. 13 లక్షలు..

11. లగ్జరీ వాచ్..

తన దగ్గర రూ. 18 లక్షల విలువ చేసే రాయల్ ఓక్ క్రోనోగ్రాఫ్ వాచ్ ఉంది..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus