‘దేవర’ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాల లిస్ట్!

  • October 16, 2024 / 09:53 PM IST

గతంలో తెలుగు సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది అంటే.. అదో పెద్ద విశేషంగా గంటలు గంటలు చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఒకప్పుడు టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. ఓ పెద్ద సినిమాకి రిలీజ్ రోజున స్క్రీన్స్ కూడా అంతంత మాత్రంగా ఉండేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత.. ఎక్కువ స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది. మొదటి వీకెండ్ కి భారీ మొత్తం వెనక్కి రాబట్టాలని డిస్ట్రిబ్యూటర్స్ టికెట్ హైక్స్ కి ప్రభుత్వం నుండి అనుమతులు తెచ్చుకుని.. టికెట్ రేట్లు భారీగా పెంచుతున్నారు. ‘3 గంటలకు ఒక ఫ్యామిలీ రూ.1500 ‘ ఖర్చు పెట్టలేదా?’ అంటూ నాగవంశీ వంటి నిర్మాతలు ధీమాగా చెబుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం.

అందుకే పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్ట్ చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేయడం అనేది పెద్ద మేటర్ కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి మన తెలుగు సినిమాలు. ఇటీవల విడుదలైన ‘దేవర’ కూడా రూ.200 కోట్లు గ్రాస్ ను కొల్లగొట్టింది. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1)ఆర్.ఆర్.ఆర్ : ఎన్టీఆర్- రాంచరణ్ – రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం రూ.413 కోట్ల గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో కొల్లగొట్టి ఇప్పటికీ నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది.

2)బాహుబలి 2 : ప్రభాస్- రానా- రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.330 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. టికెట్ రేట్లు అంతంత మాత్రం ఉన్న టైంలో కూడా ఈ మూవీ అంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.

3) కల్కి 2898 AD: ప్రభాస్ – దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.292 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టి రికార్డు కొట్టింది. నాన్ రాజమౌళి రికార్డ్స్ ని ఈ సినిమా ఆకుపై చేసింది అని చెప్పొచ్చు.

4) సలార్( పార్ట్ 1 : సీజ్ ఫైర్) : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ సలార్’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.231 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది.

5) దేవర(మొదటి భాగం): ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు(రన్నింగ్) రూ.203 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. ఇంకా థియేట్రికల్ రన్ ఉంది కాబట్టి.. లెక్క ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉంది.

6) అల వైకుంఠపురములో: అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..ల కలయికలో ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి హిట్ చిత్రాల తర్వాత రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద రూ.189 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

7)వాల్తేరు వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ్ రవితేజ కూడా ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద రూ.170 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

8)బాహుబలి (ది బిగినింగ్): దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్, రానా కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద రూ.172 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

9)సరిలేరు నీకెవ్వరు : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి..ల కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద రూ. 165 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

10) సైరా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద రూ.158 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus