యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో సాయిపల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కొన్ని నెలల క్రితం ఈ సినిమా ఓటీటీలో రిలీజవుతుందని జోరుగా ప్రచారం జరగగా నిర్మాతలు ఆ ప్రచారాన్ని ఖండించారు.
ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ లవ్ స్టోరీ సినిమాకు ఏకంగా 10 ఓటీటీ ఆఫర్లు వచ్చాయని వెల్లడించారు. థియేటర్లలో లవ్ స్టోరీ సినిమాను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఓటీటీ ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని లవ్ స్టోరీ మూవీని థియేటర్లలోనే చూడాలని సునీల్ నారంగ్ అన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సారంగ దరియా పాట అంచనాలను మించి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో నాగచైతన్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సాధిస్తానని భావిస్తుండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని సాయిపల్లవి ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి ఈ మూవీ రిజల్ట్ కు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!