ట్విస్ట్ తో ముగిసిన తెలుగు చిత్రాలు

సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుందో అనే ఆత్రుతని కలిగించకపోతే ఆ సినిమా విజయ తీరం చేరుకోలేదు. అలాగే క్లైమాక్స్ ఏ మాత్రం చప్పగా ఉన్నా, ఊహించినట్లు ఉన్నా సినిమా ఫెయిల్ అయినట్లే. అందుకే సాధ్యమైనంత వరకు శుభం కార్డుకి ముందు ఆడియన్స్ ని ఆశ్చర్యపరచడానికి డైరక్టర్లు ప్రయత్నిస్తుంటారు. ఇందులో చాలామంది సక్సస్ అయ్యారు. క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ కొన్ని సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చేశాయి. అటువంటి సినిమాల్లో టాప్ టెన్..

1. దృశ్యం ఈ చిత్రంలో అప్పటిదాకా డెడ్ బాడీ వెంకటేష్ ఇంటి గార్డెన్ లోనే ఉంది అనుకుంటాం. కానీ ఆ బాడీ ని నిర్మాణం జరుగుతున్న పోలీస్ స్టేషన్ కిందకు షిఫ్ట్ చేయడం అనేది నిజం గా డిఫరెంట్.

2. అర్జున్ రెడ్డిప్రేమించుకొని విడిపోయిన తర్వాత ఇద్దరూ కలవడంలో.. లేక హీరో తాగుబోతుకావడం లాంటి క్లైమాక్స్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో చూసాము. కానీ అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి 9 నెలల గర్భిణిగా అర్జున్ కి కనబడడం, దానికి రీజన్ అర్జున్ అని తెలియడం నిజంగా ఎవరూ ఊహించలేనిది.

3. శమంతకమణి శమంతకమణి కారుని ఆ ముగ్గురు హీరోల్లో ఒకళ్ళు తీశారు అని అనుకునే టైం లో అసలు ఆ దొంగతనానికి కారణం సుమన్ అని తెలియడం, నిజంగా సూపర్ ట్విస్ట్. అంతేకాదు ఆ కారు వల్ల ఆ ముగ్గురు జీవితాలు చాలా మారిపోయాయి అనేది కూడా హైలెట్.

4. టెంపర్రేప్, మర్డర్ చేసిన వారికీ ఎలా శిక్ష పడేలా చేస్తాడని ఆలోచిస్తున్న సమయంలో నలుగురు కాదు ఐదు మంది అంటూ తనని విలన్స్ లో ఒకరిగా చెప్పుకొని అందరికీ ఎన్టీఆర్ షాక్ ఇస్తాడు.

5. నేనొక్కడినే నాజర్ రోల్ మొదటి నుంచి పాజిటివ్ గా చూపించి చివరికి అసలైన విలన్ గా సుకుమార్ ఇచ్చిన ట్విస్ట్ ఆశ్చర్య పరుస్తుంది.

6. వేదం హీరోలైన అల్లు అర్జున్, మంచు మనోజ్ లు క్లైమాక్స్ లో చనిపోతారని ఊహించలేము. కానీ క్రిష్ వారిని చంపి పాత్రలను బతికించారు.

7. అన్వేషణ శరత్ బాబు లేక వేరే వాళ్ళు చేసారు అని అనుకునే వాళ్లంతా… అసలు విలన్ ని చూసి షాక్ అవుతారు.

8. మిస్సమ్మ భూమిక మిస్సమ్మగా అందరిని ఆకట్టుకుంది. అప్పటిదాకా ఓ శాడిస్టిగా చూపించి చివర్లో ఆమె అనారోగ్యాన్ని చెప్పిన విధానం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

9. గీతాంజలి మణిరత్నం తెరకెక్కించిన గీతాంజలి సినిమాని మనసుకు హత్తుకునే క్లైమాక్స్ తో ముగించి మెప్పించారు.

10. మెరుపు కలలు ప్రభుదేవ, కాజోల్ ని పెళ్లి చేసుకోడం కాదు అరవింద్ స్వామి తండ్రిగా మారిపోవడం. ఇది క్లైమాక్స్ లో అసలు ట్విస్ట్ అంటే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus