విజయంతో తొలి అడుగు

తొలి సినిమాతో విజయం అందుకోవడం అంటే సామాన్య విషయం కాదు. హీరోగా పరిచయమవుతూ హిట్ కొట్టాలంటే కృషితో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అలా చిత్ర సీమలో తొలి అడుగుతోనే గెలుపును సొంతం చేసుకున్న కొందరి హీరోల గురించి ఫోకస్.

తరుణ్బాల్య నటుడిగా అవార్డు అందుకున్న తరుణ్ “నువ్వే కావాలి” చిత్రంతో హీరోగా నిరూపించుకున్నారు. కె.విజయ్ భాస్కర్ దర్వకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేమ కావ్యంగా నిలిచిపోయింది. జాతీయ అవార్డు తో పాటు 4 ఫిల్మ్ పేర్ అవార్డులను గెలుచుకుంది. తరుణ్ తొలి చిత్రంతోనే 16 కోట్ల కలెక్షన్లను రాబట్టారు.

ఉదయ కిరణ్ఎటువంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తొలి చిత్రంతోనే అమ్మాయిల మనసుదోచుకున్న నటుడు ఉదయకిరణ్. తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న”చిత్రం” 2000 సంవత్సరంలో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. దీనితో పాటు ఉదయ కిరణ్ తర్వాతి చిత్రాలు నువ్వు నేను, మనసంతా నువ్వే కూడా వంద రోజులు ఆడాయి.

నితిన్తేజ నూతన నటులతో మరో సారి తెరకెక్కించిన సినిమా జయం. ఈ చిత్రంతో నితిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నితిన్ డాన్స్, నటన కుర్రకారుని విశేషంగా ఆకట్టుకుంది. ఇది బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. 2002 లో విడుదలైన ఈ ఫిల్మ్ 17 కోట్లు వసూలు చేసి.. సినీ వర్గాలను అక్చర్య పరిచింది.

రామ్గ్లామరస్ హీరో రామ్ ని దేవదాస్ చిత్రం ద్వారా వై.వి.ఎస్. చౌదరి చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఈ సినిమాతోనే ఇలియానా కూడా వేడి తెరపై అడుగు పెట్టింది. 2006 లో విడుదలైన ఈ సినిమాకు యువత జేజేలు పలికారు. 17 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన ఈ ఫిల్మ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. దాదాపు పది కోట్లు వసూలు చేసిన ఈ మూవీ హైదరాబాద్ లో 205 రోజులు ప్రదర్శించబడి రికార్డు సృష్టించింది.

ఆకాష్సాఫ్ట్ లుక్ ఆకాష్ ఆనందం సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా మెప్పించారు. ఇది అతనికి తొలి చిత్రమే అయినా అనుభవం ఉన్న నటుడిలా నటించి హిట్ కొట్టాడు. ఈ చిత్రం ఆకాష్ కి బోలెడు అవకాశాలను తెచ్చిపెట్టింది. పది కోట్ల కలెక్షన్ రాబట్టింది. ఈ ఫిల్మ్ తో శ్రీను వైట్ల కమర్షియల్ దర్శకుడిగా తొలి మెట్టు ఎక్కారు.

రామ్ చరణ్ తేజ్మెగాస్టార్ చిరంజీవి తనయుడి తొలి చిత్రం అంటే అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటన్నిటిని దాటుకుని రామ్ చరణ్ తేజ్ గెలుపు తలుపు తీశారు. చిరుతతో మెగా పవర్ ని చూపించారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 40 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

శ్రీనివాస్మారుతి అతి తక్కువ బడ్జెక్టు తో మ్యాజిక్ సృష్టించిన సినిమా “ఈ రోజుల్లో”. ఇందులో శ్రీనివాస్ పాత్రకు తగ్గ నటించి హిట్ అందుకున్నారు. తరవాత అతను నటించిన సినిమాలు ఆశించినంత విజయం అందుకోలేక పోయాయి కానీ .. “ఈ రోజుల్లో” మాత్రం బిగ్గెస్ట్ హిట్. 50 లక్షలతో నిర్మతమైన ఈ రొమాంటిక్ ఫిల్మ్ 17 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.

రాజ్ తరుణ్లఘు చిత్రాల నటుడు రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. దీంతో రాజ్ తరుణ్ ప్రేమ కథల కథానాయకుడిగా మారారు. విజయ పరంపర కొనసాగిస్తున్నారు.

వరుణ్ తేజ్మెగా కుటుంబం నుంచి వచ్చిన వరుణ్ తేజ్ మొదటి సినిమాతో క్లాస్ హిట్ సొంతం చేసుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్లో రూపుదిద్దుకున్న “ముకుంద” సినిమాలో కూల్ గా నటించి విజయ జైత్రయాత్రను ప్రారంభించారు విభిన్న కథలను ఎంచుకొని క్లాస్ ని మాస్ ని అలరిస్తున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్టాలీవుడ్ లో భారీ చిత్రాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమైన సినిమా “అల్లుడు శ్రీను”. భారీ బడ్జెక్టు తో వి.వి.వినాయక్ తెరకెక్కించిన ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది. దీంతో మొదటి సినిమాతోనే బెల్లంకొండ శ్రీనివాస్ తన ఖాతాలో ఒక హిట్ ని నమోదు చేసుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus