క్లవర్ హీరో సుశాంత్

ఈజ్ ఉన్న యాక్టర్ సుశాంత్
తెలివైన నటుడు సుశాంత్. అక్కినేని కుటుంబానికి చెందిన ఈ హీరో ఆచి తూచి అడుగులేస్తున్నారు. తనకు సెట్ అయ్యే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. పరిశ్రమలో అడుగు పెట్టి ఎనిమిదేళ్లు అవుతున్నా కేవలం మూడు సినిమాలే చేసి తన ఆలోచన సరళిని చాటుకున్నారు. ఇప్పుడు ఆటాడుకుందాం.. రా అంటూ అలరించడానికి ముందుకు వస్తున్నారు. ఈ సందర్బంగా సుశాంత్ సినీ లైఫ్, రియల్ లైఫ్ పై ఫోకస్..

అనుమోలు సత్యభూషణ రావు, నాగసుశీల ల ముద్దుల కొడుకు సుశాంత్. అతని ఇద్దరు తాతలు సినీ రంగానికి చెందిన ప్రముఖులే. ఒక తాత (అమ్మకి నాన్న) అక్కినేని నాగేశ్వరరావు గురించి అందరికీ తెలిసిందే. మరో తాత (నాన్నకు నాన్న) ఎ.వి. సుబ్బారావు తమ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై 25 సినిమాలు నిర్మించారు.

సుశాంత్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పది వరకు చదువుకున్నారు. ఇంటర్ కూడా ఇక్కడే పూర్తి చేశారు. ఇంజినీరింగ్ మాత్రం విదేశాల్లో కంప్లీట్ చేశారు.

చిత్రాల్లోకి అడుగు పెట్టె ముందు సుశాంత్ ముంబై లోని “క్రియేటింగ్ క్యారెక్టర్స్” ఇనిస్టిట్యూట్ లో నటనలో శిక్షణ పొందారు.

సుశాంత్ 2008 లో కాళిదాసు చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యారు. రవిచరణ్ రెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. హీరోయిన్ తమన్నాకి కూడా ఇది తెలుగులో తొలి పరిచయమే. ఇందులో సుశాంత్ నటన మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆహారం విషయంలో సుశాంత్ ఎప్పుడూ నిబంధనలు పాటించారు. నచ్చినవి, ఇష్టమైనవి ఫుల్ గా తినేస్తారు. కేలరీలు కరిగించుకునేందుకు ఎక్కువ సేపు వ్యాయామం చేస్తారు.

2009 లో కరెంట్ సినిమాతో సుశాంత్ యువతను మెప్పించారు. సున్నితమైన ప్రేమ కథతో హిట్ అందుకున్నారు. ఇందులో “అటు నువ్వే .. ఇటు నువ్వే” పాట కాలేజీ కుర్రోళ్ల ఫెవరెట్ సాంగ్ అయింది. ఆ ఏడాది టాప్ సాంగ్స్ లిస్టులో ఈ పాట మొదటి స్థానంలో నిలిచింది.

ఆటలంటే సుశాంత్ కి చాలా ఇష్టం. క్రికెట్ తో పాటు ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ బాగా ఆడుతారు. అతని మొదటి సినిమాలో క్రికెట్ ప్లేయర్ గా నటించారు.

నాలుగేళ్లు విరామం తర్వాత 2013 లో సుశాంత్ “అడ్డా” మూవీతో ముందుకొచ్చారు. ఈ సినిమాతో కమర్షియల్ హీరో అనిపించుకున్నారు. డ్యాన్సులు, ఫైట్లతో అదరగొట్టారు. క్లాసు, మాస్ అని తేడా లేకుండా అందరిని అలరించారు.

నిర్మాత, నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన “దొంగాట(2015)” సినిమాలో సుశాంత్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.

సుశాంత్ తన గత చిత్రాల్లో ఎప్పుడూ తాత ఏఎన్ఆర్, మామయ్య కింగ్ నాగార్జున పాటలను, పాత్రలను అనుకరించలేదు. తొలి సారి “ఆటాడుకుందాం.. రా” చిత్రంలో నాగ్ ని అనుకరించారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రలో కాసేపు కాళిదాసు కనువిందు చేయనున్నారు. అంతే కాదు తాతగారి పాట “పల్లెకు పోదాం..” ను రీమిక్స్ చేశారు. పల్లెటూరిలోనే ఈ పాటను చిత్రీకరించి నాగేశ్వరరావును గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus