తాజా జెంటిల్ మాన్ సినిమాలో నాని తర్వాత ఎక్కువ మార్కులు కొట్టేసిన నటి నివేతా థామస్. ఆమె నానితో పోటీ పడి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాను స్కిన్ షోకు దూరమని స్పష్టంగా చెబుతున్నా ఈ భామను సంప్రదిస్తున్న నిర్మాతల జాబితా పెద్దదిగానే ఉంది. ఇంతగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ రీల్, రియల్ లైఫ్ సీక్రెట్స్ మీకందిస్తున్నాం.
నివేతా తల్లిదండ్రులు కేరళ వాసులు. తల్లి పేరు ఇల్లీ థామస్, తండ్రి షాజు థామస్. చెన్నైలో స్థిరపడ్డారు. అందుకే విద్యాభ్యాసం మొత్తం చెన్నైలోనే జరిగింది. ప్రస్తుతం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆర్కిటెక్ ఫైనల్ ఇయర్ చేస్తోంది.
ఎనిమిదేళ్ళ వయసులోనే నివేతా సినిమాల్లో నటించింది. “ఉత్తర” అనే మలయాళీ చిత్రంలో బాల్యనటిగా పేరు తెచ్చుకుంది. అదే ఏడాది రిలాక్స్ అనే మూవీలోనూ యాక్ట్ చేసింది.
స్కూల్ ల్లో మంచి స్టూడెంట్ గా పేరు తెచ్చుకుంటూ .. తమిళ సీరియల్లో నటించింది. చిన్నారి నివేతా రాజా రాజేశ్వరి, మై డియర్ భూతం, శివమయం ధారావాహికల్లో చేసింది.
టీనేజ్ లోకి అడుగు పెట్టినప్పుడే నివేతా మంచి పాత్ర చేసింది.13 ఏళ్ల కూతురిగా “వేరుతే ఓరు భార్య”లో నటించి మలయాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ యువ నటి అవార్డు అందుకుంది.
సినిమాల్లో నటిస్తున్నాం కాబట్టి తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నివేతా ఎప్పుడూ అనుకోలేదు. నచ్చిన ఆహారాన్ని కడుపునిండా తినేది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఫుడ్ విషయంలో కాంప్ర మైజ్ కాలేదు.
నివేతాకు బుద్ధిగా పాఠాలు వినడమే కాదు… చెప్పడమన్నా ఇష్టమే. నటన వైపు రాకుండా ఉంటే లెక్చరర్ అయ్యేది.
నటుల్లో కమల్ హాసన్ అంటే నివేతాకు చాలా అభిమానం. ఎక్కువగా ఆయన సినిమాలు చూస్తుంటుంది. తమిళ్ “పాప నాశం” చిత్రంలో కమల్ కి కూతురిగా నటించింది.
నివేతకు పబ్ లకు వెళ్లడమంటే నచ్చదు. పార్టీలకు వెళుతుంది. కానీ కాక్ టైల్స్, మాక్ టైల్స్ ను ముట్టదు. బీచ్ పార్టీలంటే ఇష్టం.
నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుంది. యాచకురాలిగా, మల్టీ షేడ్స్ ఉన్న సైకోగా, డీ గ్లామరైజ్ పాత్రల కోసం ఆమె ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ఇల్లు, స్కూల్, షూటింగ్… ఇదే నివేతా లోకం. కొందరే స్నేహితులున్నారు. ఆమెకు తమ్ముడు, తల్లి దండ్రులే బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాని, శ్రీని ఫ్రెండ్స్ అయ్యారు.