Hanu Man OTT: ఓటీటీలో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న హనుమాన్!

కొన్ని సినిమాలు మరీ భారీ స్థాయిలో అంచనాలు లేకుండానే థియేటర్లలో విడుదలై కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా సంచలనాలు సృష్టించిన సినిమాలలో హనుమాన్ (HanuMan) మూవీ ముందువరసలో ఉంటుంది. బడ్జెట్ తో పోల్చి చూస్తే ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లను హనుమాన్ మూవీ సొంతం చేసుకోవడం గమనార్హం. హనుమాన్ సక్సెస్ సాధించిన స్థాయిలో, కలెక్షన్లను సాధించిన స్థాయిలో మరే చిన్న సినిమా సక్సెస్ కాలేదనే చెప్పాలి.

ఈ సినిమా తెలుగు వెర్షన్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే థియేటర్లలో సాధించిన సంచలనాలను హనుమాన్ మూవీ ఓటీటీలో సైతం కొనసాగిస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. కేవలం 11 గంటల్లోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో జీ5 యాప్ లో ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఓటీటీలో సైతం ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే చెప్పాలి.

ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీ వేదికగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం ఓటీటీ వేదికగా ఈ సినిమాను మళ్లీమళ్లీ చూస్తున్నారు. హనుమాన్ ఓటీటీ వేదికగా క్రియేట్ చేసే సంచలనాలు మామూలుగా ఉండవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వేర్వేరు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్న హనుమాన్ మూవీ అన్ని ఓటీటీలలో వ్యూస్ పరంగా సత్తా చాటుతోంది.

హనుమాన్ మూవీలో హీరో కింద పడిన సీన్ చూసి ఒక చిన్నారి ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హనుమాన్ సక్సెస్ తో సోషల్ మీడియాలో తేజ సజ్జా  (Teja Sajja) , ప్రశాంత్ వర్మ (Prashanth Varma) పేర్లు మారుమ్రోగుతున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకుడిగా హనుమాన్ సినిమాతో ఎన్నో మెట్లు పైకి ఎదిగారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ వర్మ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారో చూడాల్సి ఉంది.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus