సూర్య (Suriya) హీరోగా తెరకెక్కిన ‘రెట్రో’ (Retro) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని సూర్య తన ‘2D ఎంటర్టైన్మెంట్స్’ పై నిర్మించడం జరిగింది.పూజా హెగ్డే (Pooja Hegde) ఇందులో హీరోయిన్. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా మే 1న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. సూర్య, కార్తీక్ సుబ్బరాజ్..ల కల్ట్ ఫ్యాన్స్ కూడా భరించలేని విధంగా ఈ సినిమా ఉందని అంతా అభిప్రాయపడ్డారు.
దీంతో ఈ సినిమా రెండో షోకి వాషౌట్ అయిపోవడం గ్యారెంటీ అని కూడా ట్రేడ్ పండితులు తేల్చేసారు. ఇలాంటి టాక్ వస్తే… ఓపెనింగ్స్ రావడం కూడా చాలా కష్టం. కానీ ‘రెట్రో’ ఓపెనింగ్స్ విషయంలో పాస్ మార్కులు వేయించుకుంది అని చెప్పవచ్చు. ‘రెట్రో’ తమిళంలో బాగానే కలెక్ట్ చేస్తుంది. వరల్డ్ వైడ్ గా అయితే ఈ సినిమా ఇప్పటివరకు రూ.104 కోట్లు(గ్రాస్) ను కలెక్ట్ చేసింది. ఈ రోజుల్లో వీటిని గొప్ప ఓపెనింగ్స్ అని చెప్పలేం.
కానీ వరుస ప్లాపుల్లో ఉన్నప్పటికీ.. అందులోనూ డిజాస్టర్ టాక్ మూటగట్టుకున్నప్పటికీ ‘రెట్రో’ రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు.సూర్య బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ను ఓ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సరైన సినిమా పడితే.. సూర్య సినిమాలు రూ.500 కోట్లు, రూ.1000 కోట్లు కొట్టే ఛాన్స్ కూడా ఉందని చెప్పడంలో సందేహం లేదు.