ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక మీద ఇప్పటివరకు ఏ భారతీయురాలు చేయని ఓ అరుదైన పని చేసి టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారింది ప్రముఖ కథానాయిక కియారా అద్వానీ(Kiara Advani). ప్రపంచ ఫ్యాషన్‌ను ఒకే వేదిక మీద చూడాలి అనుకునేవారికి అరుదైన వేదిక ‘మెట్ గాలా’. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన దుస్తులతో సెలబ్రిటీలు అలా నడిచొస్తుంటే ఆ కిక్కే వేరు. అలాంటి కిక్ ఇచ్చే వేదిక మీద కియారా అద్వానీ బేబీ బంప్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ క్రమంలో మన దేశం నుండి ఇలా బేబీ బంప్‌తో హాజరైన తొలి సెలబ్రిటీగా చరిత్ర సృష్టించింది. దాంతోపాటు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, భావోద్వేగాలను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. గౌరవ్ గుప్తా సిద్ధం చేసిన ఆ డ్రెస్‌కు బ్రేవ్ హార్ట్స్ అనే పేరు పెట్టారు. అమ్మతనం, శక్తి, మార్పులకు ప్రతీకగా ఈ దుస్తులు సిద్ధం చేశారు. నలుపు రంగు ఆఫ్ షోల్డర్ డ్రెస్‌కు యాంటిక్ గోల్డ్‌బ్రెస్ట్ ప్లేట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దానికి పొదిగిన గుంగ్రూలు, క్రిస్టల్స్ మరింత అందాన్ని తీసుకొచ్చాయి. బ్రెస్ట్‌ప్లేట్ మీద తల్లీబిడ్డల హృదయాలు వచ్చేలా రూపొందించారు డిజైనర్ గౌరవ్ గుప్తా. రెండు హృదయాలను బొడ్డు తాడు కలిపినట్లుగా కనిపిస్తుంది. అలా ఫ్యాషన్‌లో మన కథను చొప్పించి చూపించారు. ఈ దుస్తులతకు డబుల్ ప్యానల్డ్ కేప్‌ను యాడ్ చేసింది కియారా. దివంగత ప్రముఖ ఫ్యాషన్ లెజెండ్ ఆండ్రీ లియో టాలీకి నివాళిగా అలా చేశారు.
ఇక ఆభరణాల విషయానికొస్తే ఒక చెవికి డాంగ్లర్ ఇయర్ రింగ్, మరో చెవికి ఇయర్ కఫ్‌ను ధరించింది. ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ మెట్ గాలాలో పాల్గొనాలనే తన కోరిక ఇన్నేళ్ల నెరవేరిందని చెప్పింది. నటిగా, కాబోయే తల్లిగా ఈ క్షణాలు మరపురానివి అని కూడా చెప్పింది. బేబీ బంప్‌తో బ్యూటీ కియారా చేసిన ఈ పనికి నెటిజన్లు, అభిమానులు మెచ్చుకుంటున్నారు.
You did great, MAMA. ♥️#KiaraAdvani’s iconic MET Gala debut also marked her as the first Indian actress to walk the carpet with a baby bump.#Trending pic.twitter.com/OJs8Zk4UUE
— Filmfare (@filmfare) May 5, 2025
— Filmfare (@filmfare) May 5, 2025