దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసిన 100 క్రోర్స్ మూవీ టీజర్!

Ad not loaded.

రాహుల్ టైసన్, చేతన్,ఏమీ,ఐశ్వర్య హీరోహీరోయిన్లు గా నటిస్తున్న సినిమా “100 క్రోర్స్”. ఈ సినిమాను నూతన దర్శకుడు విరాట్ చక్రవర్తి డైరెక్ట్ చేస్తున్నారు.. శ్రీమతి దివిజా సమర్పణలో యస్.యస్ స్టూడియోస్ & విజన్ సినిమాస్ బ్యానర్స్ లో సాయి కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ దీపాల సహా నిర్మాత. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “100 క్రోర్స్” మూవీ టీజర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి జూన్ 27 (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాలకు విడుదల చేశారు. మూవీ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్న అనిల్ రావిపూడి…”100 క్రోర్స్” చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

టీజర్ చూస్తే…2016 నవంబర్ 8న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ఈ అనౌన్స్ మెంట్ వచ్చిన రోజు రాత్రి ఊరి చివర పెద్ద ఎత్తున డబ్బు తగలబెట్టిన ఘటన వెలుగు చూస్తుంది. అది బ్లాక్ మనీ అయ్యి ఉంటుందనే అంచనాలు ఏర్పడతాయి. మీకు రావాల్సిన అమౌంట్ మొత్తం ఆర్బీఐ ద్వారా బెంగళూరు నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గం ద్వారా రావాలి రైట్ అనే వాయిస్ వినిపిస్తుంది. హై సెక్యూరిటీ కాపలా ఉండే ఈ భారీ మొత్తం డబ్బును ఎవరు కొట్టేశారు ?, ఎక్కడ దాచారు ?, ఆ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలేంటి ? అనేది సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

సంగీత దర్శకుడు సాయి కార్తీక్ నిర్మాతగా చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 100 క్రోర్స్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus