OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీల డామినేషన్ ఎక్కువే.. ఏకంగా 11 సినిమాలు …!

సెప్టెంబర్లో పెద్ద సినిమాల సందడి మిస్ అయ్యింది. దీంతో వరుసగా మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ‘బ్రహ్మాస్త్రం’ ‘ఒకే ఒక జీవితం’ వంటి సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ఈ క్రమంలో ఓటీటీలే రాజ్యం ఏలుతున్నట్టు కనిపిస్తుంది. థియేటర్లను మించి ప్రతి వీకెండ్ కు ఓటీటీలో కూడా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువగా ఓటీటీలకే పెద్ద పీట వేస్తున్నారు. అందరూ కంటెంట్ బాగుండాలి అంటున్నారు కానీ.. ఓ రేంజ్లో ప్రమోషన్ జరిగిన సినిమాలకు మాత్రమే జనాలు థియేటర్ కు వస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఓటీటీలనే నమ్ముకుంటున్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈ వీకెండ్ కు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) లైగర్ : పూరి జగన్నాథ్ -విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఒక్క నార్త్ లో తప్ప తెలుగులో ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే సెప్టెంబర్ 22న ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, హిందీ తో పాటు తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లలో కూడా స్ట్రీమింగ్ కానుంది.

2) కళాపురం : ‘పలాస’ ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాల దర్శకుడు కరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 23 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

3) తిరు( తిరుచిత్రామ్బలం) : ధనుష్ హీరోగా నిత్యా మేనన్, రాశీ ఖన్నా లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 23 నుండి సన్ నెక్స్ట్ లో తెలుగు, తమిళ్ తో పాటు మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

4) డైరీ : ఈ తమిళ్ మూవీ సెప్టెంబర్ 23 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

5) జంతరా : సబ్ కా నెంబర్ ఆయేగా సీజన్ 2 : ఈ హిందీ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

6) ఫస్ట్ డే ఫస్ట్ షో : ‘జాతి రత్నాలు’ అనుదీప్ కథ, డైలాగ్స్ రాసిన ఈ మూవీని సెప్టెంబర్ 23 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

7) బబ్లీ బౌన్సర్ : తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 23 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) హుష్ హుష్ : ఈ హిందీ సిరీస్ సెప్టెంబర్ 22 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

9) ఎల్.వో.యు : ఈ హాలీవుడ్ మూవీ సెప్టెంబర్ 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

10)ది కర్షషియన్స్ సీజన్ 2 : సెప్టెంబర్ 22 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) అతిథి భూతొ భవ : ఈ హిందీ మూవీ సెప్టెంబర్ 22 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus