‘శ్రీమంతుడు’ టు ‘బలగం’… కథ విషయంలో కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న సినిమాల లిస్ట్..!

‘నా కథని కాపీ కొట్టి సినిమా తీసేసారు.. నాకు క్రెడిట్ ఇవ్వలేదు’… అంటూ కొంతమంది మీడియా ముందుకు రావడం, కొత్త విషయం ఏమీ కాదు. గతంలో చాలా సార్లు ఇలాంటి ఆరోపణలు విన్నాం. ఇప్పటికీ వింటూనే ఉన్నాం. ఇటీవల ‘బలగం’ అనే సినిమా వచ్చింది. ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. దిల్ రాజు తన చిన్న బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇది పెద్ద రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టే సినిమా కాదు. తన థియేటర్స్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు. సో బిజినెస్ కు తగ్గ కలెక్షన్లు అయితే రాబట్టి సేఫ్ వెంచర్ అనిపించుకుంటుంది. అయితే ‘ఈ సినిమా కథ నాదే.గతంలో నేను ఓ మ్యాగ్జైన్ కోసం రాసిన కథను సినిమాగా తీసి క్యాష్ చేసుకుంటున్నారు… నాకు క్రెడిట్ ఇవ్వడం లేదు’ అంటూ ఓ జర్నలిస్ట్ మీడియాని ఆశ్రయించాడు.నాకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తాను అంటూ చిత్ర బృందాన్ని హెచ్చరించాడు. అయితే ‘ఈ కథ ఏ ఒక్కరిదీ కాదు.. ఇది తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయంతో రూపొందింది’ అంటూ దర్శకుడు వేణు ఆ జర్నలిస్ట్ కు సమాధానం చెప్పారు. చివరికి ఈ వివాదం ఎటు దారి తీస్తుంది… అనేది తెలియాల్సి ఉంది.

అయితే ఓ సినిమా కథ పై ఇలాంటి కాపీ ఆరోపణలు రావడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. గతంలో కూడా ఉంది. కొన్ని సినిమాల కథల విషయంలో కాపీ ఆరోపణలు అనేవి వ్యక్తమయ్యాయి. అయితే కొంతమంది డబ్బు కోసం, పబ్లిసిటీ కోసం కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. సరే ఇంతకీ ‘బలగం’ తో పాటు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) జబర్దస్త్ :

సిద్దార్థ్, సమంత జంటగా నటించిన ఈ మూవీని నందినీ రెడ్డి డైరెక్ట్ చేశారు. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రానికి నిర్మాత. అయితే ఈ చిత్రం కథ మొత్తం హిందీలో రూపొందిన ‘బ్యాండ్ బజా భారత్’ ను పోలి ఉంటుంది. సైలెంట్ గా మా చిత్రాన్ని కాపీ కొట్టేసారు అంటూ ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారు కేసు వేశారు. ఆ టైంలో ‘బ్యాండ్ బజా భారత్’ ను వాళ్ళు తెలుగులో నానితో రీమేక్ చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కేసు వేశారు. దీంతో ‘జబర్దస్త్’ చిత్రం శాటిలైట్ హక్కులు ఎవ్వరికీ అమ్మకూడదు అని కోర్టు స్టే విధించింది.

2) పాండవులు పాండవులు తుమ్మెద :

మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి శ్రీవాస్ దర్శకుడు. ఈ సినిమా కథని హిందీలో రూపొందిన ‘గోల్ మాల్ 3’ నుండి లేపేశారు. అందుకే ‘గోల్ మాల్ 3’ నిర్మాతలు… ‘పాండవులు పాండవులు తుమ్మెద’ నిర్మాతలైన మంచు ఫ్యామిలీ పై కేసు వేయగా. న్యాయస్థానం మంచు ఫ్యామిలీకి రూ.90 లక్షలు జరిమానా విధించడం జరిగింది. అంతేకాదు కొన్నాళ్ల పాటు ‘పాండవులు పాండవులు తుమ్మెద’ డబ్బింగ్ రైట్స్ ను కూడా అమ్మకూడదు అని స్టే విధించింది.

3) శ్రీమంతుడు :

మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం కథ నాదే.. నారా రోహిత్ తో ఈ కథతో సినిమా తీద్దాం అనుకుంటే కొరటాల నా కథను దొబ్బేసి సినిమా చేశారు.. అంటూ శరత్ చంద్ర అనే వ్యక్తి తెలుగు సినిమా రచయితల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కోర్టుకెక్కడం కూడా జరిగింది.

4) అఆ :

‘మీనా’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించి క్రెడిట్స్ ఇవ్వలేదు అంటూ అప్పట్లో ఈ సినిమా యూనిట్ పై ఫిర్యాదు చేయడం.. అది సంచలనంగా మారడం జరిగింది.

5) అజ్ఞాతవాసి :

‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్ మూవీని ఆధారం చేసుకుని ఈ సినిమా తీసినట్టు ఆ చిత్ర నిర్మాతలు వీరి పై కేసు వేయడం.. తర్వాత రూ.20 కోట్లు ఫైన్ వేయడం జరిగింది. కానీ ఆ తర్వాత రాజీ కుదుర్చుకుని కట్టలేదు అని సమాచారం. అజ్ఞాతవాసి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లాప్ గా మిగిలింది.

6) నిను వీడని నీడను నేనే :

సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీ ఓ షార్ట్ ఫిలిం నుండి కాపీ కొట్టారని.. సినిమా విడుదల రోజునే ఆరోపణలు వినిపించాయి. కానీ తర్వాత ఆ కథ వేరు.. ఈ కథ వేరు అని లైట్ తీసుకున్నారు.

7) ఇస్మార్ట్ శంకర్ :

ఒకప్పటి హీరో ఆకాష్.. తాను తీసిన ‘కొత్తగా ఉన్నాడు’ అనే సినిమాని కాపీ కొట్టి పూరి ఇస్మార్ట్ శంకర్ తీశాడని అతను మీడియాకెక్కాడు.తర్వాత ఏమైందో ఏమో సైలెంట్ అయిపోయాడు.

8) ఆచార్య :

ఈ సినిమా రిలీజ్ కాకుండానే ‘కథ నాది.. కొరటాల కాపీ కొట్టేశాడు’ అంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేశాడు. తర్వాత సైలెంట్ అయిపోయాడు.గతేడాది సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అవ్వడం కూడా జరిగింది.

9) క్రాక్ :

తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన ‘సేతుపతి’ రైట్స్ తాను కొనుగోలు చేస్తే.. విలన్ క్యారెక్టర్ ను మార్చేసి ‘క్రాక్’ గా తీశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని అంటూ సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ఆరోపించారు.

10) రైటర్ పద్మభూషణ్ :

ఈ మధ్యనే సుహాస్ హీరోగా వచ్చిన సినిమా ఇది. బరేలీ కి బర్ఫీ అనే బాలీవుడ్ సినిమాని కాపీ కొట్టి ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

11) బలగం :


ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ మూవీకి క్రిటిక్స్ నుండి అలాగే ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అయితే ఈ కథ నాది అంటూ ఇటీవల ఓ జర్నలిస్ట్ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus