స్టార్ హీరో చిరంజీవి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వేగంగా జరపాలని కోరుతూ కృష్ణంరాజుకు లేఖ రాశారనే సంగతి తెలిసిందే. చిరంజీవి లేఖ రాసిన తర్వాత 113 మంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఎన్నికలు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కృష్ణంరాజుకు లేఖలు రాశారు. చిరంజీవి లేఖకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల నుంచి షాకింగ్ రెస్పాన్స్ రావడం గమనార్హం. రేపటికి సభ్యుల మద్దతు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
‘మా’ కమిటీ టర్మ్ పూర్తైన నేపథ్యంలో ఎన్నికలు త్వరగా నిర్వహించాలనే డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ‘మా’ అధ్యక్ష పదవికి ప్రధానంగా ప్రకాష్ రాజ్, విష్ణు, జీవిత మధ్య పోటీ ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గత ఎన్నికలకు భిన్నంగా సినీ ప్రముఖుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఉండటంతో ఎవరు విజేతగా నిలుస్తారనే చర్చ ప్రేక్షకుల మధ్య జరుగుతోంది. ‘మా’ ఎన్నికలు జనరల్ ఎలక్షన్ ను తలపిస్తున్నాయనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.
మరోవైపు హేమకు క్రమశిక్షణా సంఘం నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఆమె ఏమని వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది. ‘మా’ పరువుప్రతిష్టలకు భంగం కలిగే విధంగా హేమ కామెంట్లు చేయడంతో మెగాస్టార్ చిరంజీవి ‘మా’ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలని కృష్ణంరాజుకు లేఖ రాశారనే సంగతి తెలిసిందే. ఆడియో టేప్ లో చేసిన కామెంట్ల విషయంలో హేమకు బహిరంగంగా ఎవరూ మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం. ప్రస్తుతం హేమ ‘మా’ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. త్వరలోనే ‘మా’ ఎన్నికలు జరిగే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!