కిస్సింగ్ సెన్సేషన్ కి కళ్యాణ్ రామ్ హిట్ ఇస్తాడా?

ఈ శుక్రవారం విడుదలవుతున్న తెలుగు చిత్రాల్లో కాస్త చెప్పుకోదగిన సినిమా ఏదైనా ఉందంటే అది “118” మాత్రమే. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి కెమెరామెన్ గుహన్ దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ మంచి ఆసక్తిని రేపింది. అయితే.. కళ్యాణ్ రామ్ కంటే ఎక్కువగా ఈ సినిమా మీద జనాలు ఆసక్తి చూపడానికి కారణం మాత్రం హీరోయిన్ షాలిని పాండే. “అర్జున్ రెడ్డి”తో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆమె.. ముద్దులతోనూ మురిపించింది. ఆ తర్వాత తమిళ చిత్రాల్లో బిజీ అయిపోవడంతో ఇప్పటివరకూ తెలుగులో కనిపించలేదు.

అందుకే.. షాలిని పాండే ఫ్యాన్స్ అందరూ “118” కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మునుపెన్నడూలేని విధంగా కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మహేష్ కోనేరు నిర్మించిన మొదటి చిత్రం “నా నువ్వే” డిజాస్టర్ అవ్వడంతో ఈ రెండో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని అతను కూడా తపిస్తున్నాడు. మరి ఈ సినిమా రిజెల్ట్ ఏమవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus