వారం మొత్తం సినిమాలే!

వారానికి మహా అయితే ఎన్ని సినిమాలు చూస్తారు చెప్పండి. మహా అయితే మూడు మరీ పిచ్చి అనుకుంటే నాలుగు, కానీ మొట్టమొదటిసారిగా శుక్రవారం మొదలుకొని ఆదివారం వరకూ రోజుకి నాలుగు చప్పను చూసినా తరగనన్ని ఈ శుక్రవారం విడుదలవుతున్నాయి. ఏకంగా 12 సినిమాలు (తెలుగు, హిందీ, ఇంగ్లీష్) ఈ శుక్రవారం థియేటర్లలో హల్ చల్ చేయనున్నాయి. ఆ సినిమాలేంటో ఒక లుక్కేద్దాం.

సిద్దార్ధ్ హీరోగా తమిళ-తెలుగు-హిందీ భాషల్లో రూపొందిన “గృహం”, మారుతి నిర్మాతగా రూపొందించిన “లండన్ బాబులు”, కార్తీ-రకుల్ జంటగా నటించిన “ఖాకీ”, ధనరాజ్-భూపాల్-మనోజ్ నందం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన “దేవిశ్రీప్రసాద్”, శివబాలాజీ, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రల్లో నటించిన “స్నేహమేరా జీవితం”, అందరూ కొత్తవారితో అమెరికాలో షూటింగ్ జరుపుకొన్న “ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం”, అందరు కొత్తవారితోనే తెరకెక్కినప్పటికీ దిల్ రాజు ఆదరణ చూరగొన్న “ప్రేమతో మీ కార్తీక్”, “డేర్” అనే తొమ్మిది తెలుగు చిత్రాలతోపాటు హిందీ సినిమాలు “”తుమారీ సులు, అక్సర్ 2”, ఆంగ్ల చిత్రం “జస్టిస్ లీగ్”లతో కలిపి మొత్తం 12 సినిమాలు. ఈ 12 సినిమాల్లో ఆసక్తిగొలిపేవి రెండు మూడు మాత్రమే అయినప్పటికీ.. రిలీజయ్యాక ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తుంది, ఏ సినిమా చతికిలపడుతుంది అనే విషయం ఎవ్వరూ ఊహించలేరు. సో ఈ వారం విన్నర్స్ ఎవరో తెలియాలంటే శుక్రవారం వరకూ వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus