‘బాహుబలి’ టు ‘సర్కారు వారి పాట’.. టాలీవుడ్లో రూ.100 కోట్లకి పైగా షేర్ ను సాధించిన 12 సినిమాల లిస్ట్..!

  • May 30, 2022 / 04:47 PM IST

ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు రూ.30 కోట్ల షేర్ మార్క్ ను సాధించడం అంటే గొప్ప విషయంగా భావించేవారు. కానీ మహేష్ బాబు- పూరి కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి’ చిత్రం రూ.39 కోట్ల షేర్ ను సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.అప్పటివరకు సౌత్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీ ఆదే. అయితే 2009లో విడుదలైన ‘అరుంధతి’ చిత్రం అన్ని భాషల్లోనూ కలుపుకుని రూ.40 కోట్లకి పైగా షేర్ ను సాధించి ‘పోకిరి’ రికార్డులను బద్దలు కొట్టింది. అయితే ‘పోకిరి’ ఒక్క భాషలో సాధించిన కలెక్షన్స్ ను అరుంధతి అధిగమించలేదు.

కానీ ‘మగధీర’ చిత్రం ఏకంగా రూ.73 కోట్ల వరకు షేర్ ను సాధించి టాలీవుడ్లో తొలి రూ.100 కోట్లు, రూ.150 కోట్లు గ్రాస్ మూవీగా నిలిచింది. ఇక ‘బాహుబలి’ దగ్గర్నుంచీ టాలీవుడ్లో రూ.100 కోట్ల షేర్ అనేది కేక్ వాక్ లా మారిపోయింది. ‘బాహుబలి’ ఆ విషయంలో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. మరి టాలీవుడ్లో ఇప్పటి వరకు రూ.100 కోట్లు షేర్ సాధించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ‘బాహుబలి 2’ :

ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.813 కోట్ల షేర్ ను సాధించి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా ఈ మూవీ కలెక్షన్లని అధిగమించలేకపోయింది.

2) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి- ఎన్టీఆర్- చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 608.65 కోట్ల షేర్ ను సాధించి ఈ మూవీ కూడా ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.

3) బాహుబలి ది బిగినింగ్ :

రాజమౌళి- ప్రభాస్-రానా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.311 కోట్ల షేర్ ను సాధించి అప్పటికి ఇండియన్ సినిమాల్లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.

4) సాహో :

ప్రభాస్- సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.233 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. బిజినెస్ పై చూసుకుంటే దీనిని యావరేజ్ మూవీగానే చెప్పాలి.

5) పుష్ప ది రైజ్ :

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.165.15 కోట్ల షేర్ ను రాబట్టింది.

6) అల వైకుంఠపురములో :

త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.160 కోట్ల వరకు షేర్ ను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా మూవీ కాకపోయినా ఈ మూవీ ఆ స్థాయిలో కలెక్ట్ చేయడం విశేషం.

7) సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.138 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది కూడా పాన్ ఇండియా మూవీ కాదు.

8) సైరా నరసింహారెడ్డి :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.133 కోట్ల షేర్ ను రాబట్టింది. కానీ ఈ మూవీ కూడా బిజినెస్ ను బట్టి బ్రేక్ ఈవెన్ సాధించలేదనే చెప్పాలి.

9) రంగస్థలం :

రాంచరణ్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.120 కోట్ల వరకు షేర్ ను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది కూడా పాన్ ఇండియా మూవీ కాదు.

10) సర్కారు వారి పాట :

మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టి.. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద రన్ అవుతుంది. ఇది కూడా పాన్ ఇండియా మూవీ కాదు కానీ బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.11 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.

11) ఖైదీ నెంబర్ 150 :

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.105 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. ఇది కూడా పాన్ ఇండియా మూవీ కాదు.

12) మహర్షి ::

మహేష్ బాబు 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.101 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇది కూడా పాన్ ఇండియా మూవీ కాదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus