Chitram movie: 21 ఏళ్ళ ‘చిత్రం’ గురించి 12 ఆసక్తి కరమైన విషయాలు..!

ఓ కొత్త దర్శకుడు కొత్త హీరో, హీరోయిన్లను పెట్టి చేసిన సినిమాకి రూ.80 లక్షలు డబ్బులు పెడితే.. పెట్టుబడి వెనక్కి వస్తుంది అన్న గ్యారెంటీనే చాలా తక్కువ. అలాంటిది ఆ సినిమా రూ.10.7 కోట్ల షేర్ ను రాబట్టింది అంటే అద్భుతమనే చెప్పాలి. అలాంటి అద్భుతాన్ని తీర్చిదిద్దిన దర్శకుడు తేజ అని చెప్పడంలో సందేహం లేదు. బాలీవుడ్లో సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన టాలీవుడ్ కు వచ్చి ఇక్కడ డైరెక్టర్ గా మారి చేసిన మొదటి మూవీ ‘చిత్రం’. 2000 వ సంవత్సరం జూన్ 16న ఈ మూవీ విడుదలైంది. నేటితో 21 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ‘చిత్రం’ గురించి ఆసక్తి కరమైన విషయాలను తెలుసుకుందాం రండి.

1) ‘చిత్రం’ మూవీతో ఉదయ్ కిరణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా రీమాసేన్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

2) చదువుకునే రోజుల్లో ప్రేమ, పెళ్లి అంటూ హద్దులు దాటితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో.. ఈ ‘చిత్రం’లో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు తేజ.

3)తనికెళ్ళ భరణి, ఢిల్లీ రాజేశ్వరి ల కామెడీ సినిమాకే ప్లస్ అని చెప్పాలి. హీరో తల్లిదండ్రులుగా వీళ్ళు ఆ పాత్రలకు జీవం పోశారు.

4)ఆర్.పి.పట్నాయక్ అందించిన సంగీతం కూడా హైలెట్ అనే చెప్పాలి. ‘ఢిల్లీనుండి గల్లీదాక’, ‘మావో వెళ్ళిపోతున్నాది’ అనే పాటలు అప్పట్లో ఓ ఊపు ఊపేసాయి. కొన్నాళ్ల పాటు ఎక్కడ చూసినా ఇవే పాటలు వినిపించేవి.

5) నిజానికి ఈ ‘చిత్రం’ లో హీరోగా ఉదయ్ కిరణ్ ను అనుకోలేదు.. వేరే హీరోని అనుకుంటే అతను హ్యాండిచ్చాడు. దాంతో ఉదయ్ కిరణ్ ను ఫిక్స్ చేశారు తేజ.

6) ఈ సినిమాకి గాను ఉదయ్ కిరణ్ అందుకున్న పారితోషికం కేవలం రూ.11వేలు. అయితే సినిమాకి లాభాలు వచ్చిన తర్వాత ఇతనికి షేర్ ఇచ్చారు.ఇక ఈ మూవీ తర్వాత ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత ఉదయ్ తోనే ‘నువ్వు నేను’ చిత్రాన్ని తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు దర్శకుడు తేజ.

7) ‘చిత్రం’ సినిమాకి గాను నిర్మాత రామోజీరావు గారు పెట్టిన బడ్జెట్ కేవలం రూ.80 లక్షలు. అది పబ్లిసిటీ ఖర్చులతో కూడా కలుపుకుని..!

8) ఇక ఫుల్ రన్లో సినిమా కలెక్ట్ చేసింది అక్షరాలా రూ.10.7 కోట్లు కావడం విశేషం.

9) అప్పట్లో పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం ఈ ‘చిత్రం’ సాధించిన విజయాన్ని చూసి షాక్ అయ్యారు. చిరంజీవి, సురేష్ బాబు వంటి పెద్దలు ‘చిత్రం’ యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా కలిసి అభినందించారు.

10) ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని మాత్రమే మనం గేమ్ ఛేంజర్ మూవీ అంటున్నాం..! అయితే సోషల్ మీడియా ఏమాత్రం లేని రోజుల్లో కూడా ‘చిత్రం’ మూవీ క్రియేట్ చేసిన సంచనాలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటి మార్కెట్ ను బట్టి.. అంటే ‘అర్జున్ రెడ్డి’ సినిమా నాటికి ఉన్న టాలీవుడ్ మార్కెట్ ను బట్టి చూస్తే ఇది రూ.100 కోట్ల మూవీ. అంటే 4 ‘అర్జున్ రెడ్డి’ లతో సమానం.

11) టికెట్ రేట్లు రూ.10 లుగా ఉన్న రోజుల్లోనే రూ.10 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఘనత దర్శకుడు తేజకు మాత్రమే దక్కింది. ఎందుకంటే ఈ సినిమాని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసింది లేదు.. అలాగే ఇందులో నటించింది స్టార్ హీరో కూడా కాదు..!

12) ఇక హీరో ఉదయ్ కిరణ్ ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఈ ‘చిత్రం’ మూవీ ద్వారా మరోసారి అతన్ని ప్రేక్షకులు తలచుకుంటారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus