సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ఇండియన్ సినిమా రేంజ్ పెంచింది కూడా సౌత్ సినిమాలే, సౌత్ ఫిలిం మేకర్సే అనడంలో సందేహం లేదు. గత ఏడాది వచ్చిన పాన్ ఇండియా సినిమాల్లో భారీ వసూళ్లు కొల్లగొట్టిన సినిమాలు ఉన్నాయి. మరి ఈ ఏడాది రాబోతున్న పాన్ ఇండియా సినిమాలు ఏంటి? వాటి బాక్సాఫీస్ స్టామినా ఎంతవరకు ఉంది? ఈ ఏడాది వెయ్యి కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) గేమ్ ఛేంజర్ (Game Changer) :
రాంచరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా సినిమా ఇది. నిర్మాత దిల్ రాజు (Dil Raju) కెరీర్లో 50వ సినిమా. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతుంది. ఈ సినిమాకి కనుక ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రూ.1000 కోట్ల క్లబ్లో చేరిపోవడం ఖాయం.
2) హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ఏ.ఎం.రత్నం (A. M. Rathnam) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఇది. క్రిష్ (Krish Jagarlamudi), రత్నం కృష్ణ (Jyothi Krishna) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం ‘హరి హర వీరమల్లు : స్వర్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే టైటిల్ తో రాబోతుంది. మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.టాక్ అనుకున్నట్టు వస్తే ఈ సినిమా రూ.300 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
3) కూలీ (Coolie) :
రజినీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకుడు. టాలీవుడ్ హీరో నాగార్జున (Nagarjuna) కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 1న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి కనుక ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోతుంది అనడంలో సందేహం లేదు.
4) థగ్ లైఫ్(Thug Life) :
చాలా గ్యాప్ తర్వాత కమల్ హాసన్ (Kamal Haasan) , దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. శింబు (Silambarasan) వంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే..!జూన్ 5న విడుదల కాబోతుంది. ఈ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే రూ.500 కోట్ల నుండి రూ.600 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
5) వార్ 2 :
ఎన్టీఆర్ (Jr NTR) , హృతిక్ రోషన్ (Hrithik Roshan) కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. హిందీలో రూపొందుతున్నప్పటికీ.. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోవడం ఖాయం.
6) సికందర్ (Sikandar) :
సల్మాన్ ఖాన్ (Salman Khan) – మురుగదాస్ (A.R. Murugadoss) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఇది కూడా పాన్ ఇండియా వైడ్ రంజాన్ కానుకగా రిలీజ్ కాబోతుంది. దీనికి పాజిటివ్ టాక్ వస్తే కనుక వెయ్యి కోట్ల క్లబ్లో ఈజీగా చేరిపోతుంది.
7) కాంతార 2 :
రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. ‘కాంతార’ రూ.400 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వస్తే.. వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం చాలా ఈజీ అని చెప్పాలి.
8) ది రాజా సాబ్ (The Rajasaab):
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మారుతి (Maruthi Dasari) దర్శకుడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. నిర్మాతలైన ‘పీపుల్ మీడియా..’ వారు ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ దీనికి బజ్ ఎక్కువగా లేదు. అయినప్పటికీ పాజిటివ్ టాక్ కనుక వస్తే.. ప్రభాస్ ఇమేజ్ ను బట్టి రూ.500 నుండి రూ.600 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
9) అఖండ 2 :
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ‘అఖండ’ (Akhanda) సీక్వెల్ గా రూపొందుతుంది ఈ సినిమా. ’14 రీల్స్ ప్లస్’ వారు దీన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. దీనికి కనుక పాజిటివ్ టాక్ వస్తే రూ.300 కోట్ల నుండి రూ.400 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
10) జాత్ :
టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తోంది. దీనికి కనుక పాజిటివ్ టాక్ వస్తే రూ.300 కోట్ల నుండి రూ.500 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
11) SYG (సంబరాల ఏటి గట్టు) :
సాయి దుర్గ తేజ్(సాయి ధరమ్ తేజ్) (Sai Dharam Tej) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రోహిత్ కెపి దర్శకుడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. సెప్టెంబర్ 25న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.ఈ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే రూ.200 కోట్ల నుండి రూ.300 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
12) కుబేర (Kubera) :
నాగార్జున (Nagarjuna) – ధనుష్ (Dhanush) – దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. దీనికి పాజిటివ్ టాక్ కనుక వస్తే రూ.200 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
13) ఇండియన్ 3 :
శంకర్ (Shankar) దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. ‘ఇండియన్ 2’ (Indian 2) ఫ్లాప్ అవ్వడం వల్ల దీనిపై అంచనాలు లేవు. అయినా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇది ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది మౌత్ టాక్ పై ఆధారపడి ఉంటుంది.