Balakrishna: నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ళ సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు!

  • June 10, 2023 / 07:27 PM IST

‘ఊరికే చరిత్రని సృష్టించలేం.. అలా అని చరిత్రని ప్లాన్ చేసి బ్లూ ప్రింటు తీయలేము’ ఈ డైలాగ్ కె.జి.ఎఫ్ సినిమాలోనిదే కానీ.. ఈ డైలాగ్ కి బెస్ట్ ఎగ్జామ్పుల్ గా బాలకృష్ణ పేరు చెప్పుకోవాలి. నందమూరి బాలకృష్ణ తన 50 ఏళ్ళ సినీ ప్రయాణం ఓ సంచలనం. ప్రస్తుతం బాలకృష్ణ తీసిన సినిమాల గురించి చాలా మందికి తెలుసు. కానీ బాలయ్య సినీ కేరీర్ లో సృష్టించిన సంచలనాల గురించి తెలిసుండకపోవచ్చు. మరీ ముఖ్యంగా ఇప్పటి జెనరేషన్ కి అస్సలు తెలిసుండకపోవచ్చు. ఈరోజు బాలయ్య పుట్టినరోజు కాబట్టి .. ఆ విషయాలు తెలుసుకుందాం రండి :

1) 1974 వ సంవత్సరంలో వచ్చిన ‘తాతమ్మ కల’ చిత్రంతో బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చారు. ఆ సినిమాలో అతని తొలి షాట్.. ఎన్టీఆర్ – భానుమతి రామకృష్ణ వంటి లెజెండ్స్ కాంబినేషన్లో చేశారు. చరిత్రలో ఇప్పటివరకు అలాంటి అవకాశం ఏ నటుడికి దక్కలేదు. ఆ ఘనత దక్కించుకున్న ఏకైన హీరో బాలకృష్ణ.

2) తాతమ్మ కల చిత్రం కుటుంబ నియంత్రణ కాన్సెప్ట్ తో రూపొందింది. అయితే మొదట ఈ చిత్రానికి సెన్సార్ వాళ్ళు అభ్యంతరాలు తెలిపారు. రిలీజ్ కావడానికి ఎంతమాత్రం వారు ఒప్పుకోలేదట. దీంతో స్క్రిప్ట్ లో మార్పులు చేసి మళ్ళీ రీషూట్లు చేయడం జరిగింది. ఇది కూడా అప్పట్లో ఓ సెన్సేషన్.

3)  బాలకృష్ణ 14 ఏళ్ళకే హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

4) బాలకృష్ణకి బ్రేక్ ఇచ్చిన మొదటి సినిమా ‘మంగమ్మగారి మనవడు’. ఈ చిత్రం ఏకంగా 525 రోజులు (ప్లాటినమ్ జూబ్లీ) ఆడి చరిత్ర సృష్టించింది.

5) ‘శ్రీరామరాజ్యం’ వంటి పౌరునికి చిత్రంలో హీరోగా నటించి హిట్ అందుకున్నారు బాలయ్య.

6) ‘భైరవద్వీపం’ వంటి జానపద చిత్రంతో కూడా సూపర్ హిట్ అందుకున్నారు.

7) పౌరునికి, జానపద చిత్రాలు మాత్రమే కాకుండా 100వ సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అనే చారిత్రాత్మక చిత్రంలో నటించి హిట్ అందుకుని చరిత్ర సృష్టించాడు బాలయ్య.

8) బాలకృష్ణ తండ్రి సీనియర్ ఎన్టీఆర్ తో ‘కలియుగ రాముడు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన రతి అగ్నిహోత్రి ‘డిక్టేటర్’ సినిమాలో నటించారు బాలయ్య. ఆవిడ అప్పట్లో స్టార్ అనే సంగతి తెలిసిందే.

9) బాలకృష్ణ నటించిన 5 సినిమాలు సంవత్సరం పాటు ఆడాయి. ‘మంగమ్మ గారి మనవడు’ ‘ముద్దుల కృష్ణయ్య’ ‘ముద్దుల మావయ్య’ ‘సమరసింహారెడ్డి’ ‘లెజెండ్’. ఏ హీరోకి ఇలాంటి రికార్డు లేదు.

10) బాలకృష్ణ ముగ్గురు డైరెక్టర్లతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నారు. ఇది కూడా రేర్ ఫీట్ అనే చెప్పాలి. కోడిరామకృష్ణ గారి దర్శకత్వంలో ‘మంగమ్మ గారి మనవడు’, ‘ముద్దుల కృష్ణయ్య’ ‘ముద్దుల మావయ్య’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నారు. ఆ తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘లారీ డ్రైవర్’ , ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ వంటి చిత్రాలతో వరుసగా 4 హిట్లు అందుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘సింహా’,’లెజెండ్’, ‘అఖండ’ వంటి హ్యాట్రిక్ హిట్లు కూడా అందుకున్నారు.

11) ‘లెజెండ్’ చిత్రం రాయలసీమలోని ఓ థియేటర్లో 1000 రోజులు ఆడింది. ఇది కూడా ఓ రేర్ రికార్డ్ అని చెప్పాలి.

12) హిందూపురం ఎం.ఎల్.ఏ గా 2 సార్లు గెలిచి పొలిటికల్ గా కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సినీ నటుడిగా కూడా బాలయ్య రికార్డ్ సృష్టించాడు.

13) బాలకృష్ణ (Balakrishna) ‘ఆహా’ వారి కోసం హోస్ట్ చేసిన ‘అన్ స్టాపబుల్ టాక్ షో’ ఇండియాలోనే హయ్యెస్ట్ రేటింగ్ సాధించిన బెస్ట్ టాక్ షోగా నిలిచింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus