30ఏళ్ళ ట్రెండ్ సెట్టర్ మూవీ.. ‘మనీ’ గురించి 13 ఆసక్తికర విషయాలు

  • June 12, 2023 / 12:49 PM IST

కామెడీ సినిమాలకి ఒకప్పుడు భారీ డిమాండ్ ఉండేది. కానీ దానికి మిస్టరీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను యాడ్ చేసి సినిమా తీయాలి అనే ఆలోచన వచ్చింది మాత్రం రాంగోపాల్ వర్మ శిష్యుడు శివ నాగేశ్వరరావుకి అనే చెప్పాలి. రాంగోపాల్ వర్మ వద్ద చాలా సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసారు శివ నాగేశ్వరరావు. జీవితాంతం నా దగ్గరే ఉండిపో అంటూ రాంగోపాల్ వర్మ ఆయనతో చాలా సార్లు అనేవారు. ‘కానీ డైరెక్టర్ అవ్వడం అనేది నా కల’ అని శివ నాగేశ్వరరావు అనడంతో.. సరే మంచి లైన్ డిజైన్ చెయ్యి.. చేద్దాం అని అన్నారు.

రాంగోపాల్ వర్మ అప్పట్లో ఫుల్ స్వింగ్ లో ఉన్న దర్శకుడు. అతను చెబితే చాలా మంది నిర్మాతలు కదిలివస్తారు. కానీ శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తాడు అని చెప్పడంతో నిర్మాతలు ఎవ్వరూ ముందడుగు వేయలేదు. ఈ విషయం శివ నాగేశ్వరరావు కి రాంగోపాల్ వర్మ చెప్పలేదు. కానీ తనే నిర్మాతగా మారాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. అది కూడా కండిషన్ మీద. ఈ సినిమా కనుక ఫెయిల్ అయితే నువ్వు జీవితంలో డైరెక్షన్ వైపు వెళ్ళకూడదు..

నా దగ్గరే పని చేయాలని రాంగోపాల్ వర్మ అన్నారట. దీంతో శివ నాగేశ్వరరావు నిద్ర లేని రాత్రులు గడిపి ‘మనీ’ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. సెట్స్ పైకి వెళ్ళింది. 1993 వ సంవత్సరం జూన్ 11 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నేటికీ ఈ సినిమా రిలీజ్ అయ్యి 30 ఏళ్ళు. ‘మనీ’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ‘మనీ’ (Money) చిత్రం చాలా మంది కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. కొంత‌మంది జీవితాల్ని మలుపు తిప్పింది ఈ సినిమా.

2) మనీ సినిమా అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది బ్రహ్మానందం కామెడీ. ఖాన్ దాదా పాత్రలో బ్రహ్మానందం నట విశ్వరూపం చూపించాడు. బ్రహ్మానందం తర్వాత బిజీ కమెడియన్ గా మారిపోవడానికి ఇదే కారణం.

3) జెడి చక్రవర్తి , చిన్నా ఈ చిత్రంలో హీరో టైపు రోల్స్ చేశారు. సినిమాలో చాలా వరకు రాంగోపాల్ వర్మతో సన్నిహితంగా ఉండేవారే నటించారు.చిన్న సినిమా కోసం బాలీవుడ్ బ్యాచ్ ను రంగంలోకి దింపి సెన్సేషన్ క్రియేట్ చేశాడు వర్మ.

4 )‘రూత్‌లెస్ పీపుల్‌’ అనే హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ‘మనీ’ రూపొందింది.

5 ) జ‌య‌సుధ – ప‌రేష్ రావ‌ల్ పాత్రలు ఈ చిత్రానికే కీలకం. ప‌రేష్ రావ‌ల్ పాత్ర కోసం ముందుగా ఎస్పీ బాలుని సంప్రదించారట. ఆయన చేయడానికి ఓకే చెప్పారు కానీ.. వ‌ర్మ కాకుండా శివ నాగేశ్వరరావు దర్శకుడు అని చెప్పడంతో ఆయన డ్రాప్ అయ్యారట. దీంతో బాలు ఈ ప్రాజెక్టులో భాగం కాలేదు.

6 )బాలు నో చెప్పడంతో దాస‌రి ని కూడా సంప్రదించారు. కానీ ఆయన బిజీ ఆయనది. అందుకే ఆయన కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాలేకపోయారు.

7 ) చివరికి ఏమీ చేసేది లేక `క్ష‌ణ క్ష‌ణం`లో చేసిన ప‌రేష్ రావ‌ల్ ను ఫైనల్ చేశాడు వర్మ. ఆయన ఈ పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.

8 ) అలాగే జ‌య‌సుధ పాత్ర‌కి మొదట రాధికని అనుకున్నారట. కానీ రాంగోపాల్ వర్మ జయసుధని తల్లిగా భావిస్తారు. ఆవిడైతేనే నేను ఈ సినిమా నిర్మిస్తాను అని తేల్చి చెప్పేశాడట. దీంతో జ‌య‌సుధని ఫైనల్ చేయడం శివ నాగేశ్వరరావు కి తప్పలేదు. అయితే ఆమె కూడా అద్భుతంగా నటించింది.

9 ) మనీ సినిమాని 24 రోజుల్లో కంప్లీట్ చేశారు.ఇప్పటి డైరెక్టర్ తేజ.. మనీ సినిమాకి కెమెరామెన్ గా చేశారు.

10 ) వాస్తవానికి ఖాన్ దాదా పాత్ర మొదట సినిమాలో లేదు. సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక.. రన్ టైం మరీ తక్కువైంది అనే భావన టీంకి కలిగింది. దీంతో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ని అతికించారు. మీరు వింటున్నది నిజమే. ఆ పాత్రని అతికించారు. కానీ సినిమా చూస్తే అలాంటి ఫీలింగ్ ఎక్కడా కలగదు. అది శివ నాగేశ్వరరావు దర్శకత్వ ప్రతిభ అనుకోవాలి.

11 ) శ్రీ సంగీతంలో రూపొందిన పాటలన్నీ హిట్టే. ముఖ్యంగా చ‌క్ర‌వ‌ర్తికీ వీధి బిచ్చ‌గ‌త్తెకీ, అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది.

12 ) మనీ సినిమాని 24 వర్కింగ్ డేస్ లో కంప్లీట్ చేశారు. రూ.30 లక్షలు బడ్జెట్ అయ్యింది. రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని రూ.3 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

13 ) కొన్నాళ్ల తర్వాత ‘మనీ’ కి సీక్వెల్ గా ‘మనీ మనీ’ వచ్చింది. మనీ రేంజ్ లో అయితే ఆ సినిమా సక్సెస్ కాలేదు. కానీ టాలీవుడ్లో సీక్వెల్ అనే ట్రెండ్ కి పునాది వేసింది ఆ సినిమా.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus